బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడికి ఉపరాష్ట్రపతి ఫోన్

by Sridhar Babu |   (  Updated:2020-05-04 09:09:08  IST  )

<p>దిశ, కరీంనగర్: బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ చేసి కుశల ప్రశ్నలు అడిగారు. సోమవారం ఫోన్ చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎలా ఉన్నావు? మీ ఆరోగ్యం ఎలా ఉందని అడిగినట్టు సత్యనారాయణ చెప్పారు. ప్రస్తుతం ఏం చేస్తున్నారని అడగ్గా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నట్టు సమాధానమిచ్చినట్టు చెప్పారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్‌లోనే ఉన్నారా అని ప్రశ్నించగా, హైదరాబాద్‌లో ఉన్నట్టు వివరించానని సత్యానారాయణ తెలిపారు. దేశవ్యాప్తంగా [&hellip;]</p>

బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడికి ఉపరాష్ట్రపతి ఫోన్
X

దిశ, కరీంనగర్: బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ చేసి కుశల ప్రశ్నలు అడిగారు. సోమవారం ఫోన్ చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎలా ఉన్నావు? మీ ఆరోగ్యం ఎలా ఉందని అడిగినట్టు సత్యనారాయణ చెప్పారు. ప్రస్తుతం ఏం చేస్తున్నారని అడగ్గా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నట్టు సమాధానమిచ్చినట్టు చెప్పారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్‌లోనే ఉన్నారా అని ప్రశ్నించగా, హైదరాబాద్‌లో ఉన్నట్టు వివరించానని సత్యానారాయణ తెలిపారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్నందున రాజకీయాల కంటే సేవా కార్యక్రమాలపైనే ఎక్కువ దృష్టి సారించాలని సూచించినట్టు పేర్కొన్నారు.

tags: vice president venkaiah naidu call, karimnagar dist bjp president, discussion

Next Story