ఏపీ ప్రభుత్వానికి ఉప రాష్ట్రపతి ప్రశంస

by Vadlamudi Anukaran |   (  Updated:2020-08-20 08:21:35  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: స్వచ్ఛ సర్వేక్షణ్-2020 అవార్డులను కేంద్రం గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డుల్లో 10 లక్షలకు పైగా జనాభా కలిగి ఉంది, పరిసరాల పరిశుభ్రతలో ఉత్తమ పనితీరు కనపరిచిన 10 నగరాల కేంద్రం గురువారం వెల్లడించింది. జాబితాలో నాలుగో స్థానంలో విజయవాడ, ఆరో స్థానంలో తిరుపతి, తొమ్మిదో స్థానంలో విశాఖ నిలిచాయి. కాగా దీనిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించాడు. అవార్డులు సాధించిన నగరాల్లో ఏపీకి చెందిన విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, జిల్లాలు ఉంటడం [&hellip;]</p>

ఏపీ ప్రభుత్వానికి ఉప రాష్ట్రపతి ప్రశంస
X

దిశ, వెబ్‌డెస్క్: స్వచ్ఛ సర్వేక్షణ్-2020 అవార్డులను కేంద్రం గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డుల్లో 10 లక్షలకు పైగా జనాభా కలిగి ఉంది, పరిసరాల పరిశుభ్రతలో ఉత్తమ పనితీరు కనపరిచిన 10 నగరాల కేంద్రం గురువారం వెల్లడించింది. జాబితాలో నాలుగో స్థానంలో విజయవాడ, ఆరో స్థానంలో తిరుపతి, తొమ్మిదో స్థానంలో విశాఖ నిలిచాయి.

కాగా దీనిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించాడు. అవార్డులు సాధించిన నగరాల్లో ఏపీకి చెందిన విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, జిల్లాలు ఉంటడం సంతోషకరం అని ట్వీట్ చేశారు. ఏపీకి వచ్చిన స్థానాల పట్ల ఏపీ ప్రభుత్వంతో పాటు ఆయా నగరాల అధికార యంత్రాంగానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు.

Next Story