సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి

54

దిశ ,తుంగతుర్తి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని నాగారం వైస్ ఎంపీపీ గుంటకండ్ల మణిమాల అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం మండల కేంద్రంలో రైతు వేదిక నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కాళేశ్వరం జలాలతో నేడు తుంగతుర్తి నియోజకవర్గం పచ్చని మాగాణిగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల గిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండ గాని అంబయ్య, గుంటకండ్ల చంద్రారెడ్డి, యాదవ రెడ్డి, సర్పంచ్ స్వప్న, టీఆర్ఎస్ నాయకులు వెంకన్న, సోమయ్య పాల్గొన్నారు.