- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్వరలోనే యూనివర్సిటీలకు వీసీలు: వినోద్
<p>దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని యూనివర్సిటీలకు త్వరలోనే వైస్ చాన్సలర్ల( వీసీ )ను నియమించనున్నట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఎక్సెల్ ఇండియా, ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ‘హయ్యర్ ఎడ్యుకేషన్ – పోస్ట్ కొవిడ్ ఎరా’ అనే అంశంపై సెమినార్‌ను బుధవారం టూరిజం ప్లాజాలో నిర్వహించారు. ఈ సెమినార్‌కు ముఖ్య అతిథిగా హాజరైన వినోద్ కుమార్ మాట్లాడుతూ… వైస్ చాన్సలర్ల భర్తీ ప్రక్రియను నెల రోజుల కాలంలో పూర్తి చేయాలనే […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని యూనివర్సిటీలకు త్వరలోనే వైస్ చాన్సలర్ల( వీసీ )ను నియమించనున్నట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఎక్సెల్ ఇండియా, ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ‘హయ్యర్ ఎడ్యుకేషన్ – పోస్ట్ కొవిడ్ ఎరా’ అనే అంశంపై సెమినార్‌ను బుధవారం టూరిజం ప్లాజాలో నిర్వహించారు. ఈ సెమినార్‌కు ముఖ్య అతిథిగా హాజరైన వినోద్ కుమార్ మాట్లాడుతూ… వైస్ చాన్సలర్ల భర్తీ ప్రక్రియను నెల రోజుల కాలంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు తెలిపారు.
వీసీలతో పాటు యూనివర్సిటీల్లో 1,061 టీచింగ్ ఫ్యాకల్టీని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ న్యాయ పరమైన కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన వివరించారు. అవసరమైతే చట్ట సవరణలు చేసి అయినా సరే యూనివర్సిటీల టీచింగ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని వినోద్ కుమార్ తెలిపారు. వివిధ పోస్టుల భర్తీకి చేపట్టే రిక్రూట్మెంట్ ప్రక్రియ ఏక కాలంలో జరిపితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.ఇటీవల బీహార్ రాష్ట్రంలో చేపట్టిన రిక్రూట్ మెంట్ విధానం అనుసరణీయమని ఆయన అభిప్రాయపడ్డారు.






