‘మోసగాళ్లు’ కథ చెప్తున్న వెంకీ మామ

25

దిశ, వెబ్‌డెస్క్: యూఎస్ ఐటీ ఇండస్ట్రీని షేక్ చేసిన అతిపెద్ద టెక్నికల్ సపోర్ట్ స్కామ్ ఆధారంగా తెరకెక్కిన ‘మోసగాళ్లు’ మూవీ టీమ్‌తో విక్టరీ వెంకటేష్ జాయిన్ అయ్యారు. ఈ చిత్రం కోసం వెంకీ మామ వాయిస్ ఓవర్ అందించగా.. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మోసగాళ్ల కథ నెరేట్ చేయనున్న వెంకీకి థాంక్స్ చెప్పాడు హీరో మంచు విష్ణు.

https://twitter.com/iVishnuManchu/status/1316961989068029953?s=19

హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గి చిన్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాను ఏవీఏ ఎంటర్‌న్మెంట్స్ బ్యానర్‌పై 24 ఫ్రేమ్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు మంచు విష్ణు. కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, రుహి సింగ్, నవీన్ చంద్ర, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా తెలుగు, ఇంగ్లీష్‌లో రూపుదిద్దుకుంటుండగా.. తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లోనూ డబ్ కానుంది. ఈ మధ్యే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మోసగాళ్లు టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే జూన్ 5న రిలీజ్ కావాల్సిన సినిమా కరోనా కారణంగా వాయిదా పడగా.. ఏడాది చివరలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా జనరేషన్స్ మధ్య కల్చరల్ క్లాష్, ధనిక పేద మధ్య తేడాలను ఈ మూవీలో చూపించబోతున్నారని తెలుస్తోంది.