రియల్ హీరోస్‌కు సెల్యూట్ : వెంకీ

by  |
రియల్ హీరోస్‌కు సెల్యూట్ : వెంకీ
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ కట్టడికి పోరాడుతున్న డాక్టర్లు, పోలీసులపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రముఖులు. వారు చేస్తున్న త్యాగాలకు దిల్ సే థాంక్యూ చెబుతున్నారు. ఈ క్రమంలోనే వారికి మనస్ఫూర్తిగా దన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు విక్టరీ వెంకటేశ్. ఆస్పత్రుల్లో ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్స్, కొవిడ్ 19తో యుద్ధం చేస్తున్న పోలీస్ యంత్రాగానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మమ్మల్ని, మా కుటుంబాలను కాపాడుతున్న మీ రుణం తీర్చుకోలేమన్న వెంకీ…. మీరు రియల్ సూపర్ హీరోలు అంటూ సెల్యూట్ చేశారు.

అలాగే మనమందరం మన దేశానికి సేవ చేసే సమయం వచ్చిందని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు వెంకీ. చేయలేం అనుకోకూడదని… రోజు రోజుకు భయం కాదు బాధ్యత పెరగాలని కోరాడు. అందరం ఒకరికి ఒకరం దూరంగా ఉంటూ ఇంట్లోనే ఉందామని.. కరోనా వైరస్ నుంచి మన దేశాన్ని మనమే రక్షించుకుందామని పిలుపునిచ్చారు. దయచేసి ప్రభుత్వం మళ్లీ ప్రకటన చేసే వరకు లాక్ డౌన్ పాటించాలని… ఇంటి నుంచి బయటకు రాకూడదని కోరాడు.

Tags:: Venkatesh, Victory Venkatesh, Tollywood, CoronaVirus, Covid19


Next Story

Most Viewed