సమంత- చైతన్య విడాకులపై మొదటిసారి స్పందించిన వెంకటేష్..?

by  |
సమంత- చైతన్య విడాకులపై మొదటిసారి స్పందించిన వెంకటేష్..?
X

దిశ, వెబ్‌డెస్క్: సమంత- నాగచైతన్య విడాకుల పై పలువురు ప్రముఖులు స్పందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విడాకుల వార్తలు వస్తున్నప్పటినుంచి అటు అక్కినేని ఫ్యామిలీ కానీ, ఇటు దగ్గుబాటి ఫ్యామిలీ కానీ నోరు మెదిపింది లేదు. ఇక ఇప్పుడు కూడా నాగార్జున, అమల కూడా వారిద్దరూ విడాకులు తీసుకోవడం మాకు బాధగానే ఉంది అని, సమంత ఎప్పుడు మాకు ప్రత్యేకమే అని చెప్పి వదిలేశారు. ఇక ఇటు పక్క దగ్గుబాటి కుటుంబం ఈ విషయంపై ఒక్కసారి కూడా మాట్లాడలేదు. వెంకటేష్, రానా, సురేష్ బాబు .. ఒక్కరు కూడా సామ్- చై విడాకులపై స్పందించలేదు.

ఇక తాజాగా సామ్- చై విడాకులపై వెంకటేష్ ఇన్ డైరెక్ట్ గా స్పందించినట్లు తెలుస్తోంది. తన ఇన్స్టా గ్రామ స్టోరీ లో పోస్ట్ చేసిన ఒక కోట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. “మనం నోరు తెరిచి మాట్లాడేముందు మైండ్ తెరిచి ఆలోచించాలి” అని పోస్ట్ పెట్టాడు. దీంతో ప్రస్తుతం సామ్- చై విడాకుల గురించి ప్రతి ఒక్కరు ఏదిపడితే అది మాట్లాడుతున్నారు. అలా మాట్లాడే ముందు ఆలోచించాలని, ఒకరి వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడేముందు ఆలోచించాలని తెలిపేలా ఆ లైన్స్ ఉండడంతో ఆయన కూడా పరోక్షంగా ఈ విడాకులపై స్పందించారని అభిమానులు గుసగుసలాడుతున్నారు. ఇకపోతే వెంకటేష్ దగ్గరే నాగ చైతన్య, రానా పెరిగారు. ఎక్కువ చై, దగ్గుబాటి ఇంట్లోనే పెరిగిన విషయం తెలిసిందే. చై తల్లి లక్ష్మి వెంకటేష్ కి స్వయానా చెల్లెలు.. దీంతో మేనల్లుడు చై అంటే వెంకీకి ఎనలేని అభిమానం.. చై పెళ్ళిలో వెంకీ, సురేష్ బాబు హంగామా ప్రత్యేక ఆకర్షణ గా నిలిచిన విషయం తెలిసిందే.



Next Story