బాలయ్య కాదు… బాబాయి, అబ్బాయిలే హీరోలు…

by  |
బాలయ్య కాదు… బాబాయి, అబ్బాయిలే హీరోలు…
X

మలయాళీ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ … పృథ్వి రాజ్, బిజూ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సాచీ దర్శకులు. ఇద్దరు ఇగోయిస్టిక్ పర్సన్స్ మధ్య జరిగే పోరాటమే సినిమా కాగా… ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ తెలుగు రీమేక్ హక్కులు కొనుగోలు చేయగా … కథకు సరిపోయే ఇద్దరు బలమైన హీరోల వేటలో ఉన్నారు.

ముందుగా సినిమాలోని రెండు కీలక పాత్రల్లో నందమూరి నటసింహం బాలకృష్ణ, దగ్గుబాటి వారసుడు రానా నటిస్తే బాగుంటుందని భావించారట నిర్మాతలు. సురేష్ ప్రొడక్షన్స్ కూడా సినిమా సంయుక్త నిర్మాణానికి ఒకే చెప్పిందట. కానీ కథ విన్నాక… బాలయ్య ఈ ప్రాజెక్ట్ పట్ల అంత సుముఖంగా లేరట. దీంతో బాలయ్య ప్లేస్ లో విక్టరీ వెంకటేష్ ను తీసుకోవాలని భావిస్తున్నారట. ఎలాగూ వెంకీ, రానా కాంబినేషన్ లో సినిమా కోసం అటు ఫ్యామిలీ, ఇటు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ సినిమాకు వెంకీ, రానానే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారట ప్రొడ్యూసర్స్. ఇదే కనుక నిజమై … ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కితే… బాబాయి అబ్బాయిల కాంబినేషన్ కనువిందు చేయడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే వెంకీ మామ సినిమా ద్వారా అల్లుడు చైతూతో నటించే ముచ్చట తీర్చుకున్న వెంకీ … ఇప్పుడు అన్న కొడుకు రానాతో నటించే ముచ్చట కూడా తీర్చుకోబోతున్నడు అన్న మాట.

Tags : Balakrishna, Venkatesh, Rana, Tollywood, Remake, Ayyappanum koshiyum



Next Story

Most Viewed