తొలిసారి సీనియర్‌తో శేఖర్ కమ్ముల

by  |
తొలిసారి సీనియర్‌తో శేఖర్ కమ్ముల
X

‘ఆనంద్’ వంటి మంచి కాఫీ లాంటి సినిమాను.. గోదావరి వంటి ఆహ్లాదకరమైన చిత్రాలను అందించడంలో శేఖర్ కమ్ముల.. ఆయనకు ఆయనే సాటి. తన కెరీర్‌లో హ్యా‌పీడేస్, ఫిదా వంటి హిట్ చిత్రాలను అందించిన ఆయన.. కొత్త హీరోలతో ప్రయోగాలు చేస్తుంటారు. ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవితో కలిసి ‘లవ్‌స్టోరీ’ సినిమా ద్వారా ఓ కొత్త ప్రేమ కథతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. కానీ లాక్‌డౌన్ కారణంగా ఆ సినిమా వాయిదా పడగా.. తొలిసారి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌తో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఏషియన్ సునీల్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఆ సినిమా.. శేఖర్ కమ్ముల మార్క్‌‌కు భిన్నంగా ఉంటుందని సమాచారం. కాగా వచ్చే ఏడాది చివర్లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

అయితే, వెంకీ ప్రస్తుతం నారప్ప చిత్రంలో బిజీగా ఉండగా.. ఈ సినిమా కంప్లీట్ కాగానే శేఖర్ కమ్ములతో జర్నీ స్టార్ట్ చేస్తాడట. కానీ ఈ కరోనా ఎఫెక్ట్‌తో నారప్ప చిత్రీకరణ ఎప్పుడు పూర్తవుతుందో.. ఎప్పుడు శేఖర్ కమ్ములతో వెంకీ సినిమా ప్రారంభం అవుతుందో చూడాలి.


Next Story