- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్లాస్టిక్ వ్యర్థాలతో కోటి సంపాదన
ఢిల్లీకి చెందిన మహిళ ప్లాస్టిక్ వ్యర్థాలను ఫ్యాషన్ బ్యాగులుగా మారుస్తుంది. ఇంటర్నేషనల్ ప్లాట్ ఫామ్స్‌పై ప్రదర్శిస్తోంది. తన యూనిక్ క్రియేషన్‌తో ఏకంగా కోటి సంపాదిస్తోంది.

దిశ, ఫీచర్స్ : ఢిల్లీకి చెందిన మహిళ ప్లాస్టిక్ వ్యర్థాలను ఫ్యాషన్ బ్యాగులుగా మారుస్తుంది. ఇంటర్నేషనల్ ప్లాట్ ఫామ్స్‌పై ప్రదర్శిస్తోంది. తన యూనిక్ క్రియేషన్‌తో ఏకంగా కోటి సంపాదిస్తోంది.
మహిళా వ్యవస్థాపకురాలు కనికా అహుజా.. ‘లిఫాఫ్ఫా (Lifaffa)’ అనే స్టార్టప్‌ను ప్రారంభించింది. ప్లాస్టిక్ వ్యర్థాలను అప్‌సైక్లింగ్ చేసి బ్యాగులు, ల్యాప్‌టాప్ స్లీవ్స్, మ్యాట్లు, ఫ్యాషన్ అనుబంధాలుగా మార్చి.. వ్యర్థాలు ల్యాండ్‌ఫిల్స్‌లోకి వెళ్లకుండా చేస్తోంది. ప్రతి నెలా దాదాపు 1,000 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను జనాలకు ఉపయోగపడే వస్తువులుగా మారుస్తోంది.
ఏం జరిగింది?
బాల్యంలో ఒక ల్యాండ్‌ఫిల్‌ను చూసిన అనుభవం కనికా అహుజాపై తీవ్ర ప్రభావం చూపింది. దాన్ని చిన్న కొండ అనుకుని ఎక్కాలని అనిపించింది కనికాకు. కానీ అక్కడ ఆడుకునే పిల్లలు అనారోగ్యం, గాయాలు పాలవుతారని చెప్పి అడ్డుకున్నారు స్థానికులు. అయితే పర్యావరణ స్పృహతో పెరిగిన ఆమె.. సర్క్యులర్ ఎకానమీ (పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ) వైపు మొగ్గు చూపింది.
ఎన్జీఓలో చేరి.. బ్రాండ్‌ను స్థాపించి..
1998లో ఆమె తల్లిదండ్రులు అనిత, శలభ్ అహుజా.. ‘కన్జర్వ్ ఇండియా’ అనే ఎన్‌జీఓను స్థాపించి ఇంధన సామర్థ్యం, ప్లాస్టిక్ సమస్యపై పని చేశారు. కనికా మనీపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ చదివి.. SRCC నుంచి MBA పూర్తి చేసి మార్కెట్ రీసెర్చ్ ఉద్యోగం చేసింది. 2016లో తల్లిదండ్రుల ఎన్‌జీఓలో చేరి. 2017లో ‘లిఫాఫ్ఫా’ బ్రాండ్‌ను ప్రారంభించింది. లిఫాఫ్ఫా ప్లాస్టిక్ బ్యాగులను కొత్త ఫాబ్రిక్‌గా మార్చే సాంకేతికతను అభివృద్ధి చేసింది. వివిధ రంగుల ప్లాస్టిక్‌ను ఉపయోగించి అందమైన డిజైన్లు, నమూనాలు క్రియేట్ చేస్తుంది. లక్మే ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనడం ద్వారా బ్రాండ్‌కు మంచి ప్రారంభం లభించింది.
లెదర్‌కు ప్రత్యామ్నాయం
లిఫాఫ్ఫా లెదర్‌కు ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్ & టైర్ వ్యర్థాల నుంచి ఉత్పత్తులు చేస్తుంది. అఫ్ఘాన్ శరణార్థి మహిళల సాంప్రదాయిక చేతి పనులను కూడా మిళితం చేసి సృజనాత్మక డిజైన్లు తయారు చేస్తోంది. ప్రతి సంవత్సరం.. దాదాపు 12,000 కేజీలు ప్లాస్టిక్‌ను అప్‌సైక్ల్ చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కోటి టర్నోవర్ దాటింది. 200 మంది వ్యర్థ సేకరణ కార్మికులు, 300 మంది కళాకారులతో పని చేస్తోన్న లిఫాఫ్ఫా... బ్యాగులు, వాలెట్లు, ల్యాప్‌టాప్ స్లీవ్స్, టేబుల్ మ్యాట్లు, ట్రేలు మొదలైనవాటిని తయారు చేస్తోంది. పర్యావరణాన్ని కాపాడుతోంది.






