ఫస్ట్ టైం తాతగా కెమెరా ముందుకు వెంకటేష్.. కూతురు, మనవరాలితో కలిసి రచ్చ

by  |
ఫస్ట్ టైం తాతగా కెమెరా ముందుకు వెంకటేష్.. కూతురు, మనవరాలితో కలిసి రచ్చ
X

దిశ, వెబ్‌డెస్క్: దగ్గుబాటి వెంకటేష్.. ఇండస్ట్రీలో వివాదాలు లేని, ఫ్యాన్ వార్స్ లేని ఒకే ఒక్క హీరో. ‘వెంకీ మామ’ అని ముద్దుగా పిలుచుకునే ప్రేక్షకులు ఆయన సినిమా అంటే ఫ్యాన్ వార్స్ అన్ని పక్కన పెట్టి చూస్తారు. వెంకీ ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉంటారు. సినిమాలు, ఫ్యామిలీ తప్ప ఫంక్షన్ లలో కూడా ఎప్పుడు కనిపించరు. వెంకటేష్ కూతుర్లు కానీ, కొడుకు కానీ ఎప్పుడు తెరపై కనిపించింది కూడా లేదు. ఇటీవలే వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత ‘ఇన్ఫినిటీ ప్లాటర్’వంట ఆధారిత యూట్యూబ్ ఛానెల్ ని ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. అందులో తన వంటకాలతో పాటు ఫ్యామిలీ విషయాలను కూడా పంచుకుంటుంది.

ఇక ఈ యూట్యూబ్ ఛానెల్ లో తాజా ఎపిసోడ్ ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అంత వైరల్ గా మారడానికి కారణం కూడా లేకపోలేదు. ఈ ఎపిసోడ్ కి వెంకటేష్ మనవరాలు గెస్ట్ గా హాజరయ్యింది. అంతేకాకుండా తాత వెంకీతో కలిసి హంగామా కూడా చేసింది. ఏంటి.. వెంకటేష్ తాత అయ్యాడా..? ఎప్పుడు..? అని కంగారు పడకండి.. ఆ పాప సురేష్ బాబు మనవరాలు.. అంటే వెంకీకి కూడా మనవరాలే కదా.. ఇక ఈ పాపే నాగ చైతన్య- సమంత పెళ్ళిలో మెరిసి.. సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా కూడా మారింది.

సురేష్ బాబు కూతురు.. రానా సోదరి మాళవిక దగ్గుబాటి కుమార్తె బేబీ ఐరా మేనత్త ఆశ్రితతో సందడి చేసింది. ఐరాకి ఇష్టమైన వంటకం వైట్ చాక్లెట్ యునికార్న్ ఫడ్జ్ ని ఆశ్రిత తయారు చేసారు. తనతో పాటే ఉండి బేబి ఐరా ఆ ప్రాసెస్ ని ఆస్వాధించింది. అంతేకాకుండా ఆ వంటకాన్ని టేస్ట్ చేయడానికి వెంకటేష్ రావడం స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. ఇక వీడియోలో వెంకీని తాత.. తాత అంటూ ఐరా పిలవడం ఎంతో ముచ్చటగా మురిపెంగా ఉంది. ఇక ఈ వీడియోపై వెంకీ అభిమానులు కాసింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెంకీ ఏజ్ 60 కి వచ్చినా ఆయన ఎప్పుడు వెంకీ మామనే.. ఐరా ఇప్పుడు వెంకీ మామను కాస్త వెంకీ తాతను చేసేసింది.. కానీ ఆయన తాతలా కనిపించడం లేదంటూ అభిమానులు కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. తనని తాతా అంటూ పిలవద్దు ఐరా! అంటూ ఫ్యాన్స్ సూచిస్తున్నారు. ఈ పూర్తి వీడియో త్వరలోనే విడుదల కానుంది.


Next Story

Most Viewed