- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రణబ్ అసామాన్యుడిగా ఎదిగారు -వెంకయ్య నాయుడు
<p>దిశ, వెబ్ డెస్క్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణవార్తపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీ తన జీవితాన్ని సామాన్య స్థాయి నుంచి ప్రారంభించి, స్వయంకృషి, క్రమశిక్షణ, అంకిత భావాలతో దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని అలంకరించే స్థాయికి ఎదిగారని ప్రశంసించారు. ఆయన ఇక లేరనే వార్త తనను తీవ్రంగా కలచివేసిందని వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశం ఓ గొప్ప పెద్ద మనిషిని కోల్పోయిందని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణవార్తపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీ తన జీవితాన్ని సామాన్య స్థాయి నుంచి ప్రారంభించి, స్వయంకృషి, క్రమశిక్షణ, అంకిత భావాలతో దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని అలంకరించే స్థాయికి ఎదిగారని ప్రశంసించారు.
ఆయన ఇక లేరనే వార్త తనను తీవ్రంగా కలచివేసిందని వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశం ఓ గొప్ప పెద్ద మనిషిని కోల్పోయిందని సంతాపం తెలియజేశారు. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Next Story






