టెన్షన్ టెన్షన్ : వేములవాడ బ్రిడ్జి ఉంటుందా.. మళ్లీ ఊడుతుందా..?

by  |
vemula-bridge-2
X

దిశ, వేములవాడ : ఒక అడుగు ముందుకు.. మూడు అడుగులు వెనక్కి.. అన్న చందంగా తయారైంది వేములవాడ మూలవాగు పై కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు. ఐదేళ్ల కిందట రూ.28 కోట్లతో నిర్మించ తలపెట్టిన వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ మూలవాగు బ్రిడ్జ్ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. గతంలోనే బ్రిడ్జి పనులు జరుగుతున్న సమయంలో వర్షం పడటం ఆ ఉధృతికి బ్రిడ్జి నిర్మాణం సపోర్టు కోసం ఉపయోగించిన ఇనుప రాడ్లు పక్కకు జరిగిపోవడంతో బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది. ఏడాది తర్వాత మళ్లీ ప్రారంభమైన నిర్మాణ పనులు జరుగుతుండగా.. ప్రస్తుతం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి మూలవాగు పరుగులు తీస్తోంది.

రోడ్డుపై చేపలు.. పట్టుకునేందుకు పోటీ పడుతున్న ప్రజలు(Video)

దీంతో నిర్మాణంలో ఉన్న వంతెన మరోసారి కూలిపోయే స్థితికి చేరుకుంది. ఏళ్లుగా సాగుతున్న నిర్మాణం ప్రతీఏడు నిర్మాణ దశలోనే కూలిపోవడం అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని పట్టణ వాసులు మండిపడుతున్నారు. వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తుల రాకపోకలకు వేరు వేరుగా ఇన్, అవుట్ రహదారులు ఉండాలన్న ప్రణాళికతో బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.కోట్లు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. అధికారుల నిర్లక్ష్య వైఖరి, కాంట్రాక్టర్‌కు భయం లేని కారణంగానే ఏళ్లు గడుస్తున్నా బ్రిడ్జి నిర్మాణం నేటికి పూర్తి కాలేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

vemula-vada 1


Next Story

Most Viewed