మీ పార్టికే మా ఓటు

4

దిశ ప్రతినిధి, మెదక్:
ప్రజా సమస్యలను పరిష్కారం చేసే సత్తా ఉన్న టీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు తెలిపాలని నిర్ణయించుకుని వేములఘట్ గ్రామస్తులు మంత్రి హరీశ్ రావును కలిశారు. గ్రామ సర్పంచ్ ఎల్లం ఆధ్వర్యంలో గ్రామంలోని అన్ని కుల సంఘాల పెద్దలు, గ్రామ యువకులు మంత్రి‌తో సమావేశం అయ్యారు. ముంపు పరిహారం ఇంకొంత పెండింగ్‌లో ఉందనీ, దాన్ని క్లియర్ చేయించాలని మంత్రిని వారు కోరారు. ముంపు ప్రజలకు గౌరవ ప్రదమైన జీవనం కల్పించాలన్నదే ప్రభుత్వధ్యేయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. అందుకు అనుగుణమైన ప్రణాళిక తమవద్ద ఉందన్నారు. ప్రభుత్వం చెప్పినట్టు కనుక అమలుజరిగివుంటే, అందరూ సహకరించి ఉంటే ఇప్పటికే అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేవని మంత్రి తెలిపారు.