‘అచ్చెన్నాయుడు బాహుబలి, లోకేశ్ గజిని’

by  |
‘అచ్చెన్నాయుడు బాహుబలి, లోకేశ్ గజిని’
X

దిశ, అమరావతి: టీడీపీలో అచ్చెన్నాయుడు బాహుబలి అయితే మరి చంద్రబాబు, లోకేశ్ ఎవరని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అచ్చెన్న కుటుంబ సభ్యులును పరామర్శించేందుకు లోకేశ్ శ్రీకాకుళం వెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి వెల్లంపల్లి లోకేశ్ పై విమర్శలు గుప్పించారు. అచ్చెన్నాయుడును సమర్థిస్తూ లోకేశ్ భుజాలు తడుముకుంటున్నారని విమర్శించారు. త్వరలో లోకేశ్ ను కూడా చంద్రబాబు పరామర్శించే రోజులు వస్తాయని అన్నారు. మంత్రి సంతకం లోకేశ్ కు తెలియదా?, మంత్రి ఆదేశిస్తే కింది స్థాయి అధికారులు ఆ పని చేయరా? అని ప్రశ్నించారు. లోకేశ్ సంతకాలు చేసిన లేఖలు అన్నీ పరిశీలిస్తాము, లోకేశ్ చేసిన అవినీతిపై కూడా విచారణ జరుగుతోందని అని తెలిపారు. తమ ప్రభుత్వం వల్ల అచ్చెన్నాయుడుకు ఎలాంటి ప్రాణహాని ఉండబోదని పేర్కొన్నారు. లోకేశ్ గజిని లాoటోడని, గత ఐదేళ్లలో ఏమి చేశారో మర్చిపోయారా? అని ప్రశ్నించారు.

Next Story

Most Viewed