రామప్ప కాల్వలకు పూర్వవైభవం తీసుకొస్త

by Shyam |

<p>దిశ, ములుగు: రామప్ప సరస్సు కింది కాలువలకు పూర్వ వైభవం తీసుకువచ్చి రైతులకు న్యాయం చేసేలా కృషి చేస్తానని జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్ వీరమల్ల ప్రకాశరావు అన్నారు. గురువారం వెంకటాపూర్ మండలంలోని రామప్ప సరస్సు, కాలువలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&#8230; రామప్ప సరస్సు కింద ఉన్న సోమీ కాలువ, ఒగరు కాలువ, నల్ల కాలువ, తదితర కాలువలను అభివృద్ధి చేసి రైతులకు న్యాయం చేస్తానన్నారు. ఆయకట్టు కింద ఉన్న చివరి [&hellip;]</p>

రామప్ప కాల్వలకు పూర్వవైభవం తీసుకొస్త
X

దిశ, ములుగు:

రామప్ప సరస్సు కింది కాలువలకు పూర్వ వైభవం తీసుకువచ్చి రైతులకు న్యాయం చేసేలా కృషి చేస్తానని జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మెన్ వీరమల్ల ప్రకాశరావు అన్నారు. గురువారం వెంకటాపూర్ మండలంలోని రామప్ప సరస్సు, కాలువలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రామప్ప సరస్సు కింద ఉన్న సోమీ కాలువ, ఒగరు కాలువ, నల్ల కాలువ, తదితర కాలువలను అభివృద్ధి చేసి రైతులకు న్యాయం చేస్తానన్నారు. ఆయకట్టు కింద ఉన్న చివరి రైతు వరకు నీరు అందించి సమన్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవాదుల ఎస్సీ బంగారయ్య, నీటిపారుదల శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Next Story