- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రికెటర్ ఇంట తీరని విషాదం.. కరోనాతో మొన్న తల్లి, నేడు సోదరి మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఒకే ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురి మరణం అది కూడా వారాల వ్యవధిలో జరగడం వారిని కోలుకోలేని విధంగా చేస్తోంది. తాజాగా ఇండియన్ మహిళా జట్టు ప్లేయర్ వేదా కృష్ణమూర్తి ఇంట్లో కరోనా మరోసారి విషాదాన్ని నింపింది. రెండు వారాల కిందటే ఆమె తల్లి కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోగా తాజాగా ఆమె సోదరి కూడా కరోనా కాటుకు బలైంది. వివరాల్లోకివెళితే.. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఒకే ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురి మరణం అది కూడా వారాల వ్యవధిలో జరగడం వారిని కోలుకోలేని విధంగా చేస్తోంది. తాజాగా ఇండియన్ మహిళా జట్టు ప్లేయర్ వేదా కృష్ణమూర్తి ఇంట్లో కరోనా మరోసారి విషాదాన్ని నింపింది. రెండు వారాల కిందటే ఆమె తల్లి కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోగా తాజాగా ఆమె సోదరి కూడా కరోనా కాటుకు బలైంది.
వివరాల్లోకివెళితే.. గత నెలలో క్రికెటర్ వేదా తల్లి చెలువాంబ దేవి కరోనా పాజిటివ్‌తో మృతి చెందింది. ఆ సమయంలోనే టెస్టులు చేయించుకోగా వేదాకు నెగెటివ్ అని తేలగా, ఆమె చెల్లెలు వత్సలకు మాత్రం పాజిటివ్ వచ్చింది. నాటి నుంచి కరోనాతో పోరాడుతున్న వత్సల గురువారం పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వేదా మాజీ కోచ్ ఇర్ఫాన్ సైత్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Next Story






