‘గని’ టీజర్‌.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న రామ్‌చరణ్ డైలాగ్

by  |
gani teaser
X

దిశ, సినిమా: మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా బాక్సింగ్ నేఫథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గని’. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ సాంగ్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇక రామ్‌ చరణ్‌ వాయిస్‌ ఓవర్‌తో మొదలైన టీజర్‌లో.. ‘ప్రతీ ఒక్కరి కథలో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. కోరికలుంటాయి, కోపాలూ ఉంటాయి. కలబడితే గొడవలుంటాయి.

అలాగే ఇక్కడున్న ప్రతీ ఒక్కడికి చాంపియన్ అయిపోవాలనే ఆశ ఉంటుంది. కానీ విజేతగా నిలిచేది ఒక్కడే. ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి.. వై యూ?’ అనే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. చివరగా ‘ఆట ఆడినా, ఓడినా రికార్డ్స్‌లో ఉంటావ్‌. కానీ గెలిస్తే మాత్రం చరిత్రలో ఉంటావ్‌’ అని ముగిసిన టీజర్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ మూవీలో వరుణ్ బాక్సర్‌గా కనిపించనుండగా.. అతడి సరసన బాలీవుడ్‌ బ్యూటీ సయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌‌గా నటిస్తోంది.

Next Story

Most Viewed