'ఇందువదన' బోల్డ్ పోస్టర్.. శోభన్ బాబును తలపిస్తున్న వరుణ్

by  |
ఇందువదన బోల్డ్ పోస్టర్.. శోభన్ బాబును తలపిస్తున్న వరుణ్
X

దిశ, వెబ్ డెస్క్: ‘హ్యాపీ డేస్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై, ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో అందరికి పక్కింటి కుర్రాడిలా మారిపోయాడు వరుణ్ సందేశ్. ఈ చిత్రాల తర్వాత వరుణ్ కొన్ని అపజయాలను చవిచూసిన విషయం తెలిసిందే. ఇక గతేడాది బిగ్ బాస్ సీజన్ 3 లో భార్య వితిక తో పాల్గొని చివరి వరకు గట్టి పోటీ ఇచ్చి , ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. ఈ షో తర్వాత వరుణ్ మరోసారి హీరోగా రీఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘ఇందువదన’. ఎం.ఎస్.ఆర్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రంలో ఫర్నాజ్ శెట్టి, వరుణ్ సరసన నటిస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ మధ్యకాలంలో తెలుగులో బోల్డ్ సినిమాలను ప్రేక్షకులు మంచిగానే ఆదరిస్తున్నారు. కథాకథనాలకు తగ్గట్టుగా ఉండే బోల్డ్ నెస్ ని ప్రేక్షకులు తప్పుపట్టడం లేదు.

ప్రస్తుతం ‘ఇందువదన’ చిత్రం కూడా ఆ కోవలోనే తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. పోస్టర్ లో వరుణ్ సందేశ్ లుక్ క్లాసిక్ డేస్ సోగ్గాడు శోభన్ బాబును తలపిస్తుంది. పంచెకట్టు ధోతి, మెడలో రుద్రాక్ష మాల, శోభన్ బాబు రింగు తో ఉన్నవరుణ్ కౌగిళ్లలో, టాప్ లెస్ చేనేత చీరలో ఫర్నాజ్ శెట్టి బందీగా ఉన్న ఈ లుక్ అందర్నీ ఆకట్టుకుంటుంది. పోస్టర్ చూస్తుంటే ఇదేదో పాతకాలం నాటి ప్రేమ కథలా కనిపిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. మరి డిఫరెంట్ లుక్, డిఫరెంట్ స్టోరీతో రీఎంట్రీ ఇస్తున్న వరుణ్ విజయాన్ని అందుకుంటాడా? లేదా? అనేది చూడాలి.



Next Story

Most Viewed