హీరోకు షాక్.. షూటింగ్ అడ్డుకున్న ఫ్యాన్స్

by  |
హీరోకు షాక్.. షూటింగ్ అడ్డుకున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అమేజింగ్ యాక్టింగ్‌ స్కిల్స్‌తో పాటు తన వే ఆఫ్ లైఫ్ స్టైల్‌ను ఇష్టపడే వారి సంఖ్య కూడా ఎక్కువే. ప్రస్తుతం వరుణ్ హారర్ కామెడీ మూవీ ‘భేడియా’ షూటింగ్ కోసం అరుణాచల్ ప్రదేశ్‌ వెళ్లాడు. హీరోయిన్ కృతి సనన్‌తో పాటు మూవీ యూనిట్ రెండు రోజుల క్రితమే అక్కడికి చేరుకోగా ఈ విషయం తెలుసుకున్న వరుణ్ ఫ్యాన్స్ షూటింగ్ స్పాట్‌కు చేరుకున్నారు.

వరుణ్‌తో టైం స్పెండ్ చేసేందుకు తమను అలో చేయాలని డిమాండ్ చేసిన ఫ్యాన్స్ షూటింగ్‌కు అడ్డుపడ్డారు. దీంతో కారుపైకి ఎక్కి షూటింగ్‌ కంటిన్యూ చేసేందుకు సహకరించాలని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు హీరో వరుణ్. ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటానని, షూటింగ్ ఎండ్ కాగానే అందరినీ మీట్ అవుతానని హామీ ఇచ్చాడు. అప్పటి వరకు శాంతిగా ఉండాలని కోరాడు. కాగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Next Story

Most Viewed