వరుణ్ వెంటపడుతున్న కెమెరామెన్

by  |
varun dawan
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ప్రతీ మూమెంట్‌ను క్యాప్చర్ చేసేందుకు ట్రై చేస్తుంటాడు ఓ కెమెరామెన్. ఇంటి నుంచి బయట అడుగుపెడితే చాలు.. కెమెరా పట్టుకుని వెంట పడతాడు. రోజు ఇదే తంతు జరుగుతుంది. ఈ రోజు (మంగళవారం) కూడా ఇదే సీన్ రిపీట్ కావడంతో.. కారు దిగి పోలీసు దగ్గరికి వెళ్లిన వరుణ్ కెమెరామెన్ గురించి చెప్పాడు. సార్ .. ఈ అబ్బాయి ఎంత చెప్పినా వినట్లేదు… చాలా సార్లు చెప్పి చూశాను… మీరైనా చెప్పండి అంటూ కామెడీ వేలో కంప్లైంట్ ఇచ్చాడు. కానీ ఈ ఘటనను కూడా వీడియో తీశాడు ఆ కెమెరామెన్. దీంతో కెమెరాను లాక్కున్న వరుణ్… తనను కూడా క్లిక్ చేశాడు. సార్ .. ఈ అబ్బాయిని ఒక్కరోజు జైల్లో పెట్టండి… అప్పుడు సెట్ అవుతాడేమో చూడాలి అంటూ ఏమీ చేయలేక వెళ్లిపోయాడు.

రెమో డిసౌజా దర్శకత్వంలో వచ్చిన ‘స్ట్రీట్ డ్యాన్సర్3’తో హిట్ అందుకున్న వరుణ్ ధావన్.. ఇప్పుడు తన తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వంలో ‘కూలీ నెం.1’ చిత్రాన్ని చేస్తున్నాడు. 1995లో వచ్చిన గోవింద, కరిష్మా కపూర్‌ల ‘కూలీ నెం.1’ సినిమాకు ఈ చిత్రం రీమేక్ కాగా.. సారా అలీఖాన్ వరుణ్‌తో జోడీ కడుతోంది. మే 1న చిత్రం విడుదల కానుంది.



Next Story