‘మాన్‌స్టర్ – సెటైర్’లో వరుణ్, కృతి రొమాన్స్

by  |
‘మాన్‌స్టర్ – సెటైర్’లో వరుణ్, కృతి రొమాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్ :
యంగ్ హీరో వరుణ్ ధావన్, బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి సనన్ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాగా గతంలో రోహిత్ శెట్టి డైరెక్షన్‌లో వచ్చిన ‘దిల్ వాలే’ సినిమాలో క్యూట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ మళ్లీ జంటగా నటించనుండటం విశేషం. అమర్ కౌశిక్ డైరెక్షన్‌లో రానున్న ‘భేడియా’ సినిమాలో మరోసారి రీల్ రొమాన్స్ చేయబోతున్నారు.

మాన్‌స్టర్ సెటైరికల్‌గా వస్తున్న సినిమాకు వరుణ్, కృతి చక్కగా సెట్ అవుతారని భావించిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్.. వీరిద్దరినీ ఎంచుకున్నారని సమాచారం. 2021 జనవరి నుంచి సినిమా సెట్స్ పైకి వెళ్లనుండగా.. చివరగా కృతి, వరుణ్ కలిసి ‘కళంక్’ సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో కనిపించారు.

కాగా ప్రస్తుతం వరుణ్ ‘కూలీ నం. 1’ సినిమా ఓటీటీలో డిసెంబర్‌లో రిలీజ్ కానుండగా.. కియారా అద్వానీ, నీతు కపూర్, అనిల్ కపూర్‌తో కలిసి కామెడీ డ్రామా చేయబోతున్నారు. ఇక కృతి విషయానికొస్తే రాజ్ కుమార్ రావుతో ఓ ప్రాజెక్ట్ చేస్తుండగా.. రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాలోనూ చేసే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed