వర్మ మరో అరాచకం.. ఇద్దరు హీరోయిన్ల రొమాన్స్ వీడియో.. 'డేంజరస్' అంటూ రిలీజ్

by  |
వర్మ మరో అరాచకం.. ఇద్దరు హీరోయిన్ల రొమాన్స్ వీడియో.. డేంజరస్ అంటూ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: రామ్ గోపాల్ వర్మ.. పరిచయం అక్కర్లేని పేరు.. వివాదాలను కొనితెచ్చుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇక వీటితో పాటు హీరోయిన్లతో మందు, చిందు అంటూ ఎంజాయ్ చేయడం అది ఒక్క ఆర్జీవీకి మాత్రమే చెల్లింది. పక్కనోడు ఎన్ని అనుకుంటే మనకేంటి.. మన జీవితం మన ఇష్టం అనే టైపు వర్మ. అందరు ఒకలాంటి సినిమాలు తీస్తే .. నేను వాటికి తలదన్నే సినిమాలు తీస్తానంటూ రాజకీయ నేతల జీవిత కథలు, రొమాంటిక్ లవ్ స్టోరీస్ పేరుతో శృంగార సినిమాలు తీసి ఒక రేంజ్ లో అభిమానులపై రివెంజ్ ప్లాన్ చేస్తున్నాడు వర్మ. ఇక తాజాగా మరో డేంజరస్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.

టాలీవుడ్ హాట్ బ్యూటీలు నైనా గంగూలీ, అప్సరా రాణిలను రంగంలోకి దించి ఇండియాలో తొలి లెస్బియన్ మూవీ రూపొందిస్తున్నాడు. కథకు తగ్గట్టే ఈ సినిమా టైటిల్ కూడా ‘డేంజరస్’ అని పెట్టి భయపెట్టాడు. ఇక ట్రైలర్ లో వర్మ మార్క్ కనిపించేలా ఇద్దరు అమ్మాయిల మధ్య ఘాటు సన్నివేశాలను జొప్పించి హీట్ పెంచాడు. దీంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఇక తాజాగా ఈ సినిమా సెకండ్ ట్రైలర్ ని ఇటీవల విడుదల చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రంలోని ఒక వీడియోను వర్మ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం పెద్ద చర్చకే దారితీసింది.

“ఇది మహిళల మధ్య సాగే ఘాటు ప్రేమ కథ. స్త్రీ, పురుషుని మధ్య ప్రేమ, లైంగిక వాంఛ ఎలా అయితే ఉంటాయో వీరి మధ్య కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే ప్రేమ అనేది ప్రేమ మాత్రమే. దానికి లింగబేధంతో ఎలాంటి సంబంధం లేదు” అని పేర్కొంటూ ఇద్దరు హాట్ బ్యూటీల ఘాటు శృంగార సన్నివేశాల వీడియోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. అది ట్రైలరా..? సెక్స్ వీడియోనా అని కొందరు అంటుండగా.. మరికొందరు సూపర్ వర్మ.. ట్రైలర్ తోనే మాలో హీట్ పెంచావ్.. సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక వీడియోలో నైనా, అప్సర ఘాటు ముద్దులు కుర్రకారు గుండెల్లో ఖచ్చితంగా మంటను పుట్టిస్తున్నాయని, సినిమాలో దమ్ము ఉంటే కచ్చితంగా హిట్ అవుతుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed