పథకాలు అందని ఇల్లు లేదు

4

దిశ గజ్వెల్: దుబ్బాక లో సంక్షేమ పథకాలు అందని ఇల్లు ఒక్కటి కూడా లేదని టీఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట సుజాత, ఎఫ్ డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. దౌల్తాబాద్ మండలంలోని గాజులపల్లి దొమ్మాట, ముత్యంపేట, సూరంపల్లి, లింగరాజు పల్లి గ్రామాల్లో జోరు వర్షంలో సైతం సోలిపేట సుజాత రామలింగారెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా సోలిపేట సుజాత మాట్లాడుతూ.. సోలిపేట రామలింగారెడ్డి మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరమని కంటతడి పెట్టుకున్నారు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని సుజాత తెలిపారు. అనంతరం వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రజలకు రైతు బంధు, రైతు భీమా రైతు రుణమాఫీ, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఉచిత కరెంటు, పీజీ నుండి కేజీ వరకు ఉచిత విద్య, కేసీఆర్ కిట్లు, ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు తెలంగాణ ప్రభుత్వం అందిస్తోందన్నారు.