- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కోటీశ్వరులు మాత్రమే తినగల అత్యంత ఖరీదైన ఆహారపదార్థాలు ఇవే!

దిశ,వెబ్ డెస్క్ : ప్రపంచంలో ఖరీదైన వస్తువులు డైమండ్స్,బంగారం, లగ్జరీ కార్లు,ఇల్లు ఇలా చాలానే ఉన్నాయి. కానీ ఈ మధ్య ఆహారపదార్థాలు కూడా చాలా ఖరీదైపోయాయి. అవి ఎలాంటి ఆహారపదార్థాలు అంటే కోటీశ్వరులు మాత్రమే రుచి చూడగలరు. ఈ ఖరీదైన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎల్విష్ హనీ అనే తేనె రకం నల్ల సముద్రం ప్రాంతాల్లో మాత్రమే లభిస్తుంది. ఈ తేనె చాలా స్వచ్ఛంగా, ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. దీని రుచి, సువాసన ప్రత్యేకమైనవి. అందుకే దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది అరుదైన ఆడ అల్బినో స్టర్జన్ గుడ్ల నుండి తయారు చేయబడిన ప్రత్యేక వంటకం. ఇదో విలాసవంతమైన ఆహారం. ఇరాన్ దీనికి పుట్టినిల్లు. ఇది అంతరించిపోతున్న చేప జాతి. ఈ వంటకం ఖరీదు 25 లక్షల రూపాయల కంటే ఎక్కువ.
కుంకుమపువ్వును ఎర్ర బంగారం అని కూడా పిలుస్తారు. కుంకుమపువ్వు, దేశంలో అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం. ఒక కేజీ కాశ్మీర్ కుంకుమపువ్వు ధర రూ. 3 లక్షలు, ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం గా పేరు పొందింది. దాదాపు సంపన్నులు ఎక్కువగా ఉపయోగించే ఈ ఖరీదైన సుగంధ ద్రవ్యం ధర రోజురోజుకూ పెరుగుతోంది. అలాగే ఇండోనేషియాకు చెందిన ప్రత్యేక రకం బ్లాక్ కాక్. ఈ బ్లాక్ చికెన్ ఇండోనేసియాలో చాలా ఫేమస్. దాని రక్తం తప్ప మిగతావన్నీ నల్లగా ఉంటాయి. పౌల్ట్రీ రంగంలోనే ఎంతో విలువైన ఈ బ్లాక్ చికెన్ ధర మార్కెట్లో కోడికి 5వేల డాలర్ల అంటే రూ.3.7 లక్షల వరకు ఉంటుంది.