కార్తీకదీపం ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్టార్ హీరో సినిమాలో వంటలక్కకు ఛాన్స్

by  |
premi-vishwanath
X

దిశ, సినిమా : ‘కార్తీక దీపం’ సీరియల్ గురించి తెలియని తెలుగు ప్రజలు ఉండరు. ఈ సీరియల్‌లోని వంటలక్క క్యారెక్టర్‌కు అభిమాన సంఘాలున్నాయంటే అతిశయోక్తి కాదు. వంటలక్క పాత్రతో మెప్పించి, ప్రతీ తెలుగింటి ఆడపడుచుగా భావించే ప్రేమీ విశ్వనాథన్.. ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేయబోతోంది. హీరో రామ్ పోతినేని – లింగుసామి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న బైలింగ్వల్ మూవీలో కీలకపాత్రలో పోషించబోతోంది.

ఈ విషయాన్ని తనే ట్విట్టర్ వేదికగా ప్రకటించగా.. వంటలక్క వెండితెర ఎంట్రీపై ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడేందుకే హైదరాబాద్‌లో రామ్ – లింగుసామిలు తనను కలిసినట్లు తెలుస్తుండగా.. ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు అభిమానులు. వంటలక్కను మరిపించే పాత్రలతో ఇండస్ట్రీలో బిజీ అయిపోవాలని కోరుకుంటున్నారు. ఇక వంటలక్క ‘కార్తీక దీపం’తో పాటు మరో మలయాళం సీరియల్ చేస్తుండగా.. ‘బోధా’ అనే సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూ నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉంది.



Next Story

Most Viewed