నటి వనితా విజయ్ కుమార్ పెద్ద కూతురు మృతి.. వివాదంతోనే పోస్ట్

by  |
నటి వనితా విజయ్ కుమార్ పెద్ద కూతురు మృతి.. వివాదంతోనే పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: వివాదస్పద నటి వనిత విజయ్ కుమార్ ఇంట్లో విషాదం చోటుచేసుకొంది. ఆమె అక్క కూతురు అనిత గుండెపోటుతో మృతి చెందింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ భావోద్వేగమయ్యారు. “ఉదయం లేవడమే ఒక విషాదకర వార్త విన్నాను. నా 20 ఏళ్ల మేనకోడలు అనిత గుండెపోటుతో మరణించింది. న్యూఢిల్లీలో స‌ర్జ‌రీ చేసుకున్న త‌ర్వాత గుండెపోటు రావ‌డంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమె నాకు దేవుడిచ్చిన కూతురులాంటిది, నాకు పెద్ద‌కూతురు వంటిది. మా నాన్న సోదరుడి కూతురు ఇంద్ర అక్క కూతురు అనిత.. ఆమె అంటే ఇంట్లో అందరికి ఎనలేని ప్రేమ.. న‌న్ను, నా పిల్ల‌ల‌ను జాగ్ర‌త్త‌గా చూసుకుంటాన‌ని మాటిచ్చింది. కానీ ఇలా మ‌మ్మ‌ల్ని అర్ధాంత‌రంగా విడిచిపెట్టి వెళ్లిపోయింది.

ఆమె పేరెంట్స్ సింగ‌పూర్‌లో ఉండ‌టంతో త‌న మృత‌దేహాన్ని కూడా అక్క‌డికే తర‌లించారు. నేనేమో దుబాయ్ లో ఉండిపోయాను. నిజానికి ఈ నెలలో మేమిద్దరం కలుద్దామనుకున్నాము. కానీ ఇంతలోనే ఇలా జరుగుతోందని అస్సలు ఊహించలేదు. ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం లేదు. కొందరు ఏ విషాదమైనా సరే, పండగ అని నగలు, పట్టుచీరలు కొని పండగ చేసుకుంటారు. మా కుటుంబంలో అలాంటి వారు లేనందుకు ఆనందిస్తున్నాను. అనితా నిన్నెప్పుడు మిస్ అవుతాను. అత‌న్‌, అంజ‌న కోస‌మైనా ఇంద్ర అక్క స్ట్రాంగ్‌గా ఉండాలి. నా డార్లింగ్ అనిత ఎప్ప‌టికీ నా కూతురే..’ అని ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇంత భావోద్వేగంలోనూ వనిత ఎవరి మీదనో సెటైర్ వేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.


Next Story