- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రామా బృందాలు మమ్మల్ని విడదీయలేవు : వనిత
<p>తమిళ నటి, నిర్మాత వనిత విజయ్ కుమార్ ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. వనిత జూన్ 27న పీటర్ పాల్‌ను మూడో పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో పాల్ మొదటి భార్య నుంచి విమర్శలు కూడా ఎదుర్కొంది. పాల్ తనకు విడాకులు ఇవ్వకుండానే.. వనితను పెళ్లి చేసుకున్నాడని ఆమె ఆరోపించింది. దీంతో తనకు సపోర్ట్ చేస్తూ కొంత మంది సెలబ్రిటీలు వనితను ప్రశ్నించగా గట్టిగానే సమాధానం ఇచ్చింది. అంతేకాకుండా వనిత, పాల్‌లు […]</p>

తమిళ నటి, నిర్మాత వనిత విజయ్ కుమార్ ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. వనిత జూన్ 27న పీటర్ పాల్‌ను మూడో పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో పాల్ మొదటి భార్య నుంచి విమర్శలు కూడా ఎదుర్కొంది. పాల్ తనకు విడాకులు ఇవ్వకుండానే.. వనితను పెళ్లి చేసుకున్నాడని ఆమె ఆరోపించింది. దీంతో తనకు సపోర్ట్ చేస్తూ కొంత మంది సెలబ్రిటీలు వనితను ప్రశ్నించగా గట్టిగానే సమాధానం ఇచ్చింది. అంతేకాకుండా వనిత, పాల్‌లు మరోసారి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.
https://www.instagram.com/p/CCT88dJDGhe/?utm_source=ig_web_copy_link
లాక్‌డౌన్ కారణంగా వనిత ఆర్డర్ చేసిన మ్యారేజ్ రింగ్స్ పెళ్లికి అందలేదు. కాగా, ఇటీవలే అందిన రింగ్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన వనిత.. పాల్, తన మధ్య ప్రేమ కొందరికి ఎప్పటికీ అర్థం కాదని తెలిపింది. తనను దేవుడు పంపిన సోల్ మేట్‌గా అభివర్ణించిన వనిత.. చివరి శ్వాస వరకు ప్రేమలో ఉంటామని చెప్పింది. ఏ చట్టం లేదా డ్రామా బృందాలు తమను విడదీయ లేవని తెలిపింది. కాగా వనిత షేర్ చేసిన రింగ్స్‌లో ఒకదానిపై తాళం ఉండగా.. మరో దానిపై తాళం చెవి ఉంది.






