- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నయన్‌ను ప్రశ్నించలేదేం? : వనిత
<p>వనిత విజయ్ కుమార్ కోలీవుడ్‌లో కొత్త రచ్చకు తెరలేపింది. సీనియర్ నటుడు విజయ్ కూతురైన వనిత.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా రాణించలేక పోయింది. నిర్మాతగా మారి పలు సినిమాలు నిర్మించిన ఆమె.. ఆ తర్వాత రియాలిటీ షో బిగ్ బాస్‌తో మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చింది. తాజాగా పీటర్ పాల్‌తో వనితకు జరిగిన మూడో పెళ్లి వివాదానికి దారితీసింది. తనకు విడాకులు ఇవ్వకుండానే వనితను వివాహం చేసుకున్నాడని పీటర్ భార్య చేసిన ఆరోపణలకు సినీ ప్రముఖులు కొందరు […]</p>

వనిత విజయ్ కుమార్ కోలీవుడ్‌లో కొత్త రచ్చకు తెరలేపింది. సీనియర్ నటుడు విజయ్ కూతురైన వనిత.. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా రాణించలేక పోయింది. నిర్మాతగా మారి పలు సినిమాలు నిర్మించిన ఆమె.. ఆ తర్వాత రియాలిటీ షో బిగ్ బాస్‌తో మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చింది. తాజాగా పీటర్ పాల్‌తో వనితకు జరిగిన మూడో పెళ్లి వివాదానికి దారితీసింది. తనకు విడాకులు ఇవ్వకుండానే వనితను వివాహం చేసుకున్నాడని పీటర్ భార్య చేసిన ఆరోపణలకు సినీ ప్రముఖులు కొందరు వనితను ప్రశ్నించారు. దీంతో వారితో ఆన్‌లైన్ వార్‌కు దిగింది భామ. లక్ష్మీకృష్ణన్, కస్తూరి లాంటి సీనియర్ యాక్టర్స్‌ను నోటికొచ్చినట్లు తిట్టేసింది.
ఇప్పుడు కొత్తగా లేడీ సూపర్‌స్టార్ నయనతారను కూడా ఈ వివాదంలోకి లాగింది వనిత. ప్రభుదేవాతో నయన్ సహజీవనం చేసినప్పుడు.. భార్యకు విడాకులు ఇచ్చాడా? అని ప్రశ్నించింది. తనను క్వశ్చన్ చేయని వారు.. నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారని మండిపడింది. అయితే నయన్‌పై విమర్శలు చేసిన వనితపై ఫ్యాన్స్ ట్రోల్‌కు దిగడంతో ఆ ట్వీట్ డిలీట్ చేసిన ఆమె.. ట్విట్టర్ హ్యాండిల్‌ను డీయాక్టివేట్ చేసేసింది.






