బన్నీ నాకు లైన్ వేశాడు: వనితా విజయ్ కుమార్

by  |
బన్నీ నాకు లైన్ వేశాడు: వనితా విజయ్ కుమార్
X

దిశ, వెబ్‌డెస్క్: వనితా విజయ్ కుమార్..నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. ఇటీవల మూడో పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న ఈ నటి..ప్రస్తుతం నాలుగో పెళ్లికి సిద్ధమైందని వార్తలొచ్చాయి. తాజాగా ఈమె టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెన్నైలో తెలుగు పరిశ్రమ ఉన్న సమయంలో మెగాస్టార్ ఫ్యామిలీతో తమకు చాలా అనుబంధం ఉండేదని చెప్పింది. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగే ఫంక్షన్లకు తమ ఫ్యామిలీ మొత్తం వెళ్లే వాళ్లమని తెలిపింది.

ఆ సమయంలో చిరంజీవి నటించే ఓ సినిమా ఓపెనింగ్‌కి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న అల్లు అర్జున్ సూపర్ స్టైలీష్‌గా తయారై..తనకు లైన్ వేశాడని పేర్కొంది. బన్నీకి అప్పుడు 14 సంవత్సరాలు ఉంటాయని..అతను తన కన్న చిన్నవాడు అయినా కూడా అలా తన వైపు చూశాడని చెప్పింది. అప్పుడు నేను మ్యాంగో కలర్ డ్రెస్‌లో ఉన్నానని..కొన్ని రోజులకు బన్ని ఆ డ్రెస్‌ను ఓ ఫోన్ కాల్ మాట్లాడుతూ గుర్తు చేశాడని, బన్ని సూపర్ డ్యాన్సర్‌ అని ప్రశంసించింది. తనతో కలిసి నటించే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తానని, బన్నీకి అత్తగా నటించాలని ఉందని చెప్పింది.


Next Story