‘ఆమె’ బయోపిక్‌లో నటించాలని ఉంది: వాణి కపూర్

by  |
‘ఆమె’ బయోపిక్‌లో నటించాలని ఉంది: వాణి కపూర్
X

దిశ, వెబ్ డెస్క్: 2019లో బయోపిక్‌ల జోరు కొనసాగింది. ఇప్పటకీ అదే ట్రెండ్ కొనసాగుతోంది. అన్ని భాషా చిత్రాల్లోనూ వీటి జోరే కనిపిస్తోంది. ఇటీవలే హ్యుమన్ కంప్యూటర్ శకుంతల దేవి సినిమా విడుదలైన విషయం తెలిసిందే. విద్యాబాలన్ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా విమర్శకుల ప్రశసంలు అందుకుంది. టాలీవుడ్‌, బాలీవుడ్‌లోనూ పలు బయో‌పిక్‌లు నిర్మాణంలో ఉన్నాయి. ఇలాంటి చిత్రాలను చేయడానికి హీరో, హీరోయిన్లు కూడా ఆసక్తి చూపిస్తుండటంతో .. ఫిల్మ్ మేకర్స్ వాటిని మన ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

స్టార్లు కూడా ఫలానా వారి బయోపిక్‌లో నటించాలని ఉందని తమ మనసులో మాటను చెప్పేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బేఫికర్ బ్యూటీ వాణికపూర్ అంతరిక్షంలో అడుగుపెట్టిన భారత సంతతికి చెందిన తొలి మహిళగా చరిత్ర సృష్టించిన కల్పనా చావ్లా బయోపిక్‌లో నటించాలన్నది తన లక్ష్యమని చెప్పింది.

‘కల్పనాచావ్లా జీవితం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ స్ఫూర్తిదాయకం. అంతరిక్షంలో అడుగుపెట్టాలని కలలు కనే ప్రతి మహిళ ఆమె జీవితం నుంచి నేర్చుకోవచ్చు. ఆమె గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆమె జీవన ప్రయాణాన్ని ఈ ప్రపంచానికి చూపాల్సిన అవసరముంది. వ్యోమగామి కావాలనుకునే వారు కల్పనా చావ్లాను ఓ రోల్ మోడల్‌గా తీసుకుంటారు. ఆమె బయోపిక్‌లో న‌టించాల‌ని ఎంతో ఆశగా ఉంది. ఒకవేళ ఆమె బయెపిక్‌లో నటించే అవకాశం వస్తే .. గొప్ప గౌరవంగా భావిస్తా’ అని వాణి కపూర్ చెప్పింది. ‘శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌’ ‘బేఫికర్’ ‘వార్‌’ చిత్రాలతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆమె ప్రస్తుతం ‘బెల్‌బాటమ్‌’ చిత్రంలో నటిస్తోంది.



Next Story

Most Viewed