- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్నే విచారించండి.. వామన్ రావు తండ్రి సంచలన వ్యాఖ్యలు
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్ : హైకోర్టు అడ్వకేట్స్ వామన్ రావు, నాగమణిలది పక్కా సుపారీ మర్డరేనని అతని తండ్రి గట్టు కిషన్ రావు ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.2 కోట్ల డీల్ కుదుర్చుకునే తన కొడుకు, కొడలును చంపేశారన్నారు. జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, అతని భార్య మంథని మునిసిపల్ ఛైర్ పర్సన్ శైలజ పరోక్ష అండదండలతో ప్రత్యక్ష్యంగా హత్య చేయించారని కిషన్ రావు అన్నారు. రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య చేయడానికి […]</p>

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హైకోర్టు అడ్వకేట్స్ వామన్ రావు, నాగమణిలది పక్కా సుపారీ మర్డరేనని అతని తండ్రి గట్టు కిషన్ రావు ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.2 కోట్ల డీల్ కుదుర్చుకునే తన కొడుకు, కొడలును చంపేశారన్నారు. జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, అతని భార్య మంథని మునిసిపల్ ఛైర్ పర్సన్ శైలజ పరోక్ష అండదండలతో ప్రత్యక్ష్యంగా హత్య చేయించారని కిషన్ రావు అన్నారు. రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య చేయడానికి కారణం వారి పక్కా ప్లాన్‌లో భాగమేనని రామగిరి ఎస్సైకి తాను అనుమానితుల పేర్లు చెప్తున్నా పట్టించుకోలేదన్నారు. కేవలం మంథని ప్రాంత విషయాలకు సంబంధించిన వ్యవహరాల గురించి వామన్ రావు హైకోర్టులో కేసులు వేస్తున్నారన్న కక్షతోనే చంపేశారన్నారు. ఈ మర్డర్ కేసులో గుంజపడుగు గ్రామం నుండి హైదరాబాద్ వరకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.
నన్నే విచారించండి..
వామన్ రావు దంపతుల హత్య కేసులో పోలీసులకు తాను ఫిర్యాదు చేసిన విషయాలపై విచారించేందుకు తననే ఇన్వెస్టిగేట్ చేాయాలని కిషన్ రావు కోరారు. అంతేకాకుండా నార్కో ఎనాలిసిస్ టెస్టులకు సైతం తాను సిద్దమేనన్నారు.






