తెలుగులో ‘గంగుబాయి కతియావాడి’.. ఆసక్తికరంగా టీజర్

by  |
తెలుగులో ‘గంగుబాయి కతియావాడి’.. ఆసక్తికరంగా టీజర్
X

దిశ, సినిమా : బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ ఆలియా భట్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’ రిలీజ్ సందర్భంగా టీమ్‌కు ‘తెలుగు’లో విషెస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఆమె లీడ్ రోల్ ప్లే చేసిన ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘గంగుబాయి కతియావాడి’ టీజర్‌ను తెలుగులో ఈ రోజు(శుక్రవారం) విడుదల చేశారు మేకర్స్. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించిన విషయం విదితమే. ఇక ఈ సినిమా టీజర్‌ను ‘వకీల్ సాబ్’ ప్రదర్శితమయ్యే అన్ని చోట్లా ఆ సినిమాకు ముందు ప్రదర్శించనున్నారు. ఈ క్రమంలో ఆలియా సినిమాకు ఫుల్ పాపులారిటీ లభించనుంది.

‘గంగు చంద్రిక’గా ఆలియా ఆహార్యం, డైలాగ్ డెలివరీ చూస్తే కామతిపుర రాణిగా గంగుబాయిగా పాత్రలో ఆలియా ఒదిగిపోయిందన్న విషయం అర్థమవుతుంది. ఇక ఈ సినిమాతో ఆలియా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుండటంతో ఇండస్ట్రీ ప్రముఖులు, ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ఈ సినిమా జులై 30న విడుదల కానుంది. లెజెండరీ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో ఆలియా సీతగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌కు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే.



Next Story