- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీకా తీసుకున్న వాలంటీర్ మృతి.. భారత్ బయోటెక్ క్లారిటీ!
<p>దిశ, వెబ్‌డెస్క్ : కరోనా నివారణకు తయారు చేయబడిన టీకాలను దేశ వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు కేంద్రం సన్నద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వ్యాక్సిన్ డ్రై రన్‌లో భాగంగా టీకా తీసుకున్న వాలంటీర్ ఒకరు మృతి చెందాడు. 9 రోజుల ముందుకు అతనికి భారత్ బయోటెక్ తయారీ కోవాగ్జిన్ టీకాను ఇచ్చారు. దీంతో వ్యాక్సిన్ రీయాక్షన్ వల్లే వాలంటీర్ మృతి చెందినట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, దానిని సరిచేసేందుకు భారత్ బయోటిక్ […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా నివారణకు తయారు చేయబడిన టీకాలను దేశ వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు కేంద్రం సన్నద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వ్యాక్సిన్ డ్రై రన్‌లో భాగంగా టీకా తీసుకున్న వాలంటీర్ ఒకరు మృతి చెందాడు. 9 రోజుల ముందుకు అతనికి భారత్ బయోటెక్ తయారీ కోవాగ్జిన్ టీకాను ఇచ్చారు. దీంతో వ్యాక్సిన్ రీయాక్షన్ వల్లే వాలంటీర్ మృతి చెందినట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, దానిని సరిచేసేందుకు భారత్ బయోటిక్ సంస్థ రంగంలోనికి దిగింది.
వివరాల్లోకివెళితే.. భోపాల్‌లో ఫేజ్-3 ట్రయల్స్‌లో వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ కన్నుమూశాడు. గత నెలలో టీకాలు వేసిన తొమ్మిది రోజుల తరువాత మరియు “సైట్ యొక్క ప్రాథమిక సమీక్షలు మరణం అధ్యయన మోతాదుతో సంబంధం లేదని సూచిస్తున్నాయి”. “పోస్ట్-మార్టం నివేదిక ప్రకారం … అనుమానాస్పద విషం కారణంగా కార్డియోస్పిరేటరీ వైఫల్యమే వాలంటీర్ మరణానికి కారణం” అని సంస్థ ప్రకటించింది.






