వకీల్ సాబ్ షూట్ షురూ..

by  |
వకీల్ సాబ్ షూట్ షురూ..
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ గురించి ఫ్యాన్స్ ఎప్పట్నుంచో వెయిటింగ్. చాలా ఏళ్ల తర్వాత పవర్ స్టార్ నుంచి వస్తున్న ఈ సినిమా టీజర్ అంచనాలను భారీగా పెంచగా.. కరోనా కారణంగా వాయిదా పడిన షూటింగ్ మళ్లీ షురూ అయింది. పింక్ రీమేక్‌గా వస్తున్న సినిమాలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రలో సూపర్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్న పవర్ స్టార్.. మళ్లీ షూటింగ్‌లో జాయిన్ కానున్నారు.

వకీల్ సాబ్‌లో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం సెట్స్‌లోకి వచ్చినందుకు హ్యాపీగా ఉందని తెలుపుతూ పోస్ట్ పెట్టింది నివేద. పవర్ స్టార్ లాయర్‌గా కనిపించబోతున్న సినిమా సెట్స్ నుంచి పిక్ షేర్ చేయగా.. ఏదైనా అప్‌డేట్ ఇస్తే బాగుంటుందని కోరుతున్నారు ఫ్యాన్స్.

దిల్ రాజు, శిరీష్, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకులు కాగా, ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.



Next Story

Most Viewed