దటీజ్ పవర్ స్టార్.. మహేశ్ బాబు అడ్డాలో రికార్డ్ క్రియేట్

87
pawan kalyan, mahesh babu

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లో ఏ హీరోకీ దక్కనటువంటి అశేష అభిమాన దళం ఆయన సొంతం. అలాంటి ఆయన నుంచి ఎలాంటి అప్ డేట్ వచ్చిన అభిమానుల హడావిడి మాములుగా ఉండదు. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ‘వకీల్ సాబ్’ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాలీవుడ్‌లో అమితాబ్ నటించిన ‘పింక్’ రీమేక్‌గా వస్తో్న్న విషయం తెలిసిందే. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. కాగా, ఏప్రిల్ 9వ తేదీన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది.

 Vakeel Saab

అయితే.. మూడేళ్ల తర్వాత మళ్లీ తెరపైన కనిపించనున్న పవన్ కళ్యాణ్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కనీవినీ ఎరుగని రితీలో టికెట్స్ బుక్ అయ్యాయంటే ఏ స్థాయిలో పవన్ సినిమా కోసం ఎదరుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఈ సినిమాకు తొలిరోజు ఊహించని విధంగా ఓపెనింగ్స్ రావడం ఖాయం అయిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న భారీ మల్టీప్లెక్సులలో ఒకటైన AMB సినిమాస్‌లో వకీల్ సాబ్ రికార్డు సృష్టిస్తున్నాడు. ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్ ఇది. మూడేళ్ళ చరిత్ర ఉన్న ఈ థియేటర్‌లో మునుపెన్నడూ లేని రికార్డులకు తెరతీస్తున్నాడు పవర్ స్టార్. మహేష్ బాబు థియేటర్‌లో ఆయనకే సాధ్యం కాని రికార్డులను ప్రస్తుతం పవన్ తిరగరాస్తున్నాడు. ఇప్పటి వరకు ఏ సినిమాకు సాధ్యం కాని రీతిలో AMB సినిమాస్‌లో టికెట్స్ బుక్ అయిపోతున్నాయి. ఒకటి రెండు కాదు.. ఏకంగా 27 షోలు మొత్తం హౌజ్ ఫుల్స్ అయిపోయాయి. అందుకే తొలిరోజు టికెట్స్ ఎక్కడా దొరికే పరిస్థితి లేదు. విడుదలకు మూడు రోజుల ముందే AMB సినిమాస్‌‌లో ఒక్క టికెట్ కూడా లేకపోవడం రికార్డు. దీంతో ఏప్రిల్ 9న వకీల్ సాబ్ కలెక్షన్ల సూనామీ సృష్టం ఖాయం అయిపోయింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..