పవన్ ‘వకీల్‌సాబ్’ మ్యూజిక్ ఫెస్ట్.. ఎక్కడంటే

by  |
పవన్ ‘వకీల్‌సాబ్’ మ్యూజిక్ ఫెస్ట్.. ఎక్కడంటే
X

దిశ, సినిమా : పాలిటిక్స్‌లో బిజీగా గడుపుతూ కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరమైన జనసేనాని పవన్ కల్యాణ్.. మళ్లీ ‘వకీల్‌సాబ్‌’తో రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా నుంచి ఇటీవలే విడుదలైన ‘కంటిపాప’ సాంగ్ ట్రెండింగ్‌లో ఉండగా, సినిమా మ్యూజికల్ ఫెస్ట్ గురించి మూవీ యూనిట్ నుంచి అఫీషియల్‌ అనౌన్స్‌‌మెంట్ వచ్చేసింది. ‘వకీల్‌సాబ్’ మ్యూజికల్ ఈవెంట్‌ను హైదరాబాద్‌, దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ఐటీ (మల్లారెడ్డి కాలేజ్)లో ఈ రోజు(శనివారం) నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

ఈ కార్యక్రమానికి డైరెక్టర్ వేణుశ్రీరాం, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్‌తో పాటు యూనిట్ సభ్యులు హాజరు కానున్నారు. కాగా కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరు అవుతారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాలో అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రలు పోషించారు. కాగా వచ్చే నెల 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.



Next Story

Most Viewed