కోకాకోలా ఫ్రైడ్ రైస్ తెలుసా?

by  |
కోకాకోలా ఫ్రైడ్ రైస్ తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : కొన్ని ఫుడ్ కాంబినేషన్స్ చాలా టేస్టీగా ఉంటాయి. మళ్లీ ఎప్పుడెప్పుడు తినాలా? అనేంతగా జిహ్వ చాపల్యాన్ని పుట్టిస్తాయి. ఇది పక్కనబెడితే కొన్ని వెరైటీ ఫుడ్ కాంబినేషన్ల పేరు వింటేనే.. వాంతికొస్తుంది. ఉదాహరణకు.. న్యూటెల్లా బిర్యానీ, రెడ్ సాస్ పాస్తా దోశ. ఇలాంటి ఓ వింతైన వంటకాన్ని వడోదరకు చెందిన స్ట్రీట్ వెండర్ రుచి చూపిస్తున్నాడు. నెట్‌లో వైరల్‌గా మారిన ఆ ఫుడ్ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతుండటం విశేషం.

వడోదరలోని సమతా పోలీస్ చౌక్ సమీపాన ఓ స్ట్రీట్ వెండర్.. ‘బావు ఆమ్లెట్ సెంటర్’ రన్ చేస్తున్నాడు. అతడు ప్రత్యేకంగా ‘కోలా ఎగ్ ఫ్రైడ్‌రైస్ ’ చేస్తున్నాడు. దీనికోసం 30 గుడ్లు, కోకాకోలా, చీజ్ ఉపయోగిస్తున్నాడు. దీని తయారీ విధానాన్ని ‘ఆమ్చీ ముంబై’ అనే చానల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ముందుగా ఎగ్స్ వేసి.. అందులో టమాటా, కొత్తిమీర, మిర్చి మిక్స్ చేసిన తర్వాత రైస్ యాడ్ చేసి ఫ్రైడ్ రైస్‌ను తయారుచేస్తాడు. సదరు రైస్‌ను కోకాకోలాలో సోక్ చేసి, ఆ తర్వాత దానిపై చీజ్‌తో గార్నిష్ చేస్తాడు. దీన్ని చూసిన నెటిజన్లు ‘ఇలా అడ్డమైనవన్నీ వేస్తే.. ఫుడ్ పాయిజన్ జరిగి బాత్రూమ్‌లోనే చచ్చిపోతాం’ అంటున్నారు. ఇక కోకాకోలాలో మెంటోస్ వేస్తే పొంగుతుందని అందరికీ తెలిసిందే కదా! ఈ మేరకు ఓ నెటిజన్.. ‘కోకాకోలా మెంటోస్ రైస్ చేయండి’ అని సలహా ఇచ్చాడు.

వంటలో ప్రయోగాలు చేయాలి కానీ.. ఇంత దారుణమైన కాంబినేషన్లు ట్రై చేయకూడదు. వంటింటి రుచులను నోరూరేలా చేయాలి కానీ.. నోట్లో పెట్టుకుంటే వాంతులు చేసుకోకుండా జాగ్రత్త పడాలి. సో.. మరి వింత వంటకాలు మనకు అవసరం లేదు. ఉన్నదాంట్లో మంచి రుచులు తింటే చాలు.


Next Story

Most Viewed