16 లక్షల మందికి టీకా

by  |
16 లక్షల మందికి టీకా
X

న్యూఢిల్లీ: కరోనా టీకా పంపిణీ కార్యక్రమాన్ని అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, బ్రిటన్‌ల కంటే ఇండియానే వేగంగా నిర్వహిస్తున్నదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 10 లక్షల మందికి టీకా వేయడానికి యూకేకు 18 రోజులు పట్టిందని, యూఎస్‌కు 10 రోజులు పట్టిందని పేర్కొంది. కానీ, భారత్ మాత్రం కేవలం ఆరు రోజుల్లోనే 10 లక్షల మందికి టీకా వేసిందని వివరించింది. ఆదివారం నాటికి దేశంలో మొత్తం సుమారు 16 లక్షల మందికి టీకా వేసినట్టు వెల్లడించింది.

ప్రభుత్వానికి అందిన ప్రొవిజనల్ సమాచారం ప్రకారం, ఆదివారం సాయంత్రానికి మొత్తం 16,13,667 మందికి టీకా పంపిణీ జరిగింది. మొత్తం 28, 613 సెషన్‌లు పూర్తయ్యాయి. హర్యానా, కర్ణాటక, పంజాబ్, రాజస్తాన్, తమిళనాడులలో ఆదివారం వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. సాయంత్రం ఏడున్నరకల్లా ఐదు రాష్ట్రాల్లో మొత్తం 31,466 లబ్దిదారులు టీకా పొందారని కేంద్రం తెలిపింది.


Next Story

Most Viewed