వాట్సప్‌లోనూ వ్యాక్సిన్ బుకింగ్స్.. ఎలా చేయాలంటే ?

by  |
vaccine
X

న్యూఢిల్లీ: థర్డ్‌వేవ్ హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగా వాట్సప్ ద్వారా కూడా టీకాను బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విట్టర్ వేదికగా మంగళవారం వెల్లడించారు. వ్యాక్సిన్‌ను బుక్ చేసుకునే విధానాన్ని తెలియజేశారు. మైగవ్‌ ఇండియా సైతం ఈ ప్రక్రియను తన ట్విట్టర్ హ్యాండిల్‌లో వెల్లడించింది.

వాట్సప్‌లో టీకా బుక్ చేసుకునే విధానం
* +91 9013151515 నెంబర్‌ను వాట్సప్ సౌలభ్యం గల స్మార్ట్ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి
* వాట్సప్‌లోకి వెళ్లి ఈ కాంటాక్ట్‌‌కు ‘బుక్ స్లాట్’ అని మెసేజ్ చేయాలి
* మీకు ఎస్ఎంఎస్ రూపంలో వచ్చిన ఆరు అంకెల ఓటీపీని ఎంటర్ చేయాలి
* టీకా తీసుకునేందుకు మీకు వీలైన తేదీ, లొకేషన్, పిన్‌కోడ్, వ్యాక్సిన్‌ రకాన్ని నమోదు చేయాలి
* ఆ తర్వాత వ్యాక్సిన్ స్లాట్ బుక్ అయినట్టు మీరు కన్ఫర్మేషన్ పొందుతారు.


Next Story

Most Viewed