లక్కీ చాన్స్ కొట్టేసిన వాణి కపూర్

by  |
లక్కీ చాన్స్ కొట్టేసిన వాణి కపూర్
X

‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘బేఫికర్’ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ వాణి కపూర్.. తెలుగులో హీరో నానితో ‘ఆహా కల్యాణం’ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత అడపదడపా అవకాశాలొచ్చినా.. అంతగా గుర్తింపు తెచ్చే పాత్రలేవీ ఆమెకు దక్కలేదు. ఇటీవలి కాలంలో ‘వార్’ సినిమా హిట్ అయినా.. ఆ విజయం కూడా ఆమెకు పెద్దగా అవకాశాల్ని తీసుకురాలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఓ బంపర్ ఆఫర్‌ను దక్కించుకుంది ఈ అమ్మడు.

అక్షయ్ కుమార్ హీరోగా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘బెల్ బాటమ్’. 80ల నాటి నేపథ్యంలో ఈ కథ ఉంటుందని చిత్ర బృందం వెల్లడించిన విషయం తెలిసిందే. రంజిత్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ థ్రిల్లర్ సినిమాలో వాణీ హీరోయిన్‌గా ఎంపికైంది. దీనిపై వాణి కపూర్ స్పందిస్తూ.. ‘సూపర్ సూపర్ థ్రిల్‌డ్. అక్షయ్ కుమార్ సార్‌ పక్కన చేయబోతున్నందుకు చాలా ఎక్సైటింగ్‌గా ఫీలవుతున్నాను. చిత్ర షూటింగ్ కోసం వెయిట్ చేయలేకపోతున్నాను’ అంటూ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. వాణీ పాత్ర సినిమాలో కీలక ములుపుకు కారణమవుతుందని దర్శకుడు రంజిత్ తివారీ స్పష్టం చేశాడు.



Next Story

Most Viewed