- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖలో చంద్రబాబుకు ఊహించని షాక్
<p>దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు విశాఖలో షాక్ తగిలింది. జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు విశాఖకు వెళ్లిన చంద్రబాబు నిరసనలు స్వాగతం పలికాయి. విశాఖ ఆర్థిక రాజధానిగా ఉండేందుకు చంద్రబాబు అనుకూలమా..? వ్యతిరేకమా అంటూ ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. చంద్రబాబు ఉత్తరాంధ్రప్రచారానికి వచ్చే ముందుకు ఉత్తరాంధ్ర ప్రజలకు ఈ అంశంపై క్లారిటీ ఇవ్వాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. పరిపాలనా రాజధానిగా అంగీకరిస్తారా లేదా అని చెప్పాలని డిమాండ్ చేశారు. […]</p>

దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు విశాఖలో షాక్ తగిలింది. జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు విశాఖకు వెళ్లిన చంద్రబాబు నిరసనలు స్వాగతం పలికాయి. విశాఖ ఆర్థిక రాజధానిగా ఉండేందుకు చంద్రబాబు అనుకూలమా..? వ్యతిరేకమా అంటూ ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. చంద్రబాబు ఉత్తరాంధ్రప్రచారానికి వచ్చే ముందుకు ఉత్తరాంధ్ర ప్రజలకు ఈ అంశంపై క్లారిటీ ఇవ్వాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. పరిపాలనా రాజధానిగా అంగీకరిస్తారా లేదా అని చెప్పాలని డిమాండ్ చేశారు.
విశాఖను పరిపాలనా రాజధానిగా అంగీకరించిన తర్వాతే ప్రచారం నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీంతో విశాఖలో చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఇకపోతే పుర ఎన్నికల్లో భాగంగా చంద్రబాబు నాయుడు రెండు రోజులపాటు విశాఖలో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం 5 నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. పెందుర్తి, గోపాలపట్నం, తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెంలో రోడ్ షోలో పాల్గొంటారు. అలాగే శనివారం కూడా విశాఖలో ఎన్నికల ప్రచారం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.






