- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జస్టిస్ బీబర్ సౌదీ అరేబియా షో చేయకూడదు : హత్యకు గురైన రిపోర్టర్ ఫియాన్సీ
<p>దిశ, సినిమా :ఇస్తాంబుల్‌లో హత్యకు గురైన స్లెయిన్ రిపోర్టర్ జమాల్ ఖషోగ్గి ఫియాన్సీ హాటిస్ సెన్‌జిజ్.. కెనడియన్ సింగర్ జస్టిన్ బీబర్‌కు ఓపెన్ లెటర్ రాసింది. డిసెంబర్ 5న జరిగే ‘ఫార్ములా వన్ సౌదీ అరేబియన్ గ్రాండ్ పిక్స్ షో’లో పాల్గొనకూడదని అతన్ని లేఖలో కోరింది. 2018లో జరిగిన ఖషోగ్గి మర్డర్‌లో సౌదీ అరేబియన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ హస్తముందని యూఎస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గతంలోనే తెలపగా.. ఈ హత్యలో తన ప్రమేయాన్ని ఖండించాడు ప్రిన్స్. […]</p>

దిశ, సినిమా :ఇస్తాంబుల్‌లో హత్యకు గురైన స్లెయిన్ రిపోర్టర్ జమాల్ ఖషోగ్గి ఫియాన్సీ హాటిస్ సెన్‌జిజ్.. కెనడియన్ సింగర్ జస్టిన్ బీబర్‌కు ఓపెన్ లెటర్ రాసింది. డిసెంబర్ 5న జరిగే ‘ఫార్ములా వన్ సౌదీ అరేబియన్ గ్రాండ్ పిక్స్ షో’లో పాల్గొనకూడదని అతన్ని లేఖలో కోరింది. 2018లో జరిగిన ఖషోగ్గి మర్డర్‌లో సౌదీ అరేబియన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ హస్తముందని యూఎస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గతంలోనే తెలపగా.. ఈ హత్యలో తన ప్రమేయాన్ని ఖండించాడు ప్రిన్స్.
ఈ క్రమంలో ‘నా డియరెస్ట్ జమాల్ హంతకుల కోసం నువ్వు పాడొద్దు’ అని బీబర్‌ను కోరింది హాటిస్. ‘దయచేసి మాట్లాడండి. హంతకుడు మహమ్మద్ బిన్ సల్మాన్‌ను ఖండించండి. మీ స్వరం మిలియన్ ప్రజలకు వినిపిస్తుంది. మీరు ప్రిన్స్ బంటుగా ఉండటానికి నిరాకరిస్తే.. మీ సందేశం బిగ్గరగా, స్పష్టంగా ఉంటుంది. నేను నియంతల కోసం పని చేయను. డబ్బు కంటే న్యాయం, స్వేచ్ఛను ఎంచుకుంటాను’ అని చెప్పాలంటూ కోరింది. ఈ షోలో పర్ఫార్మ్ చేయకపోవడం వల్ల ఈ సందేశాన్ని ఇచ్చిన వారవుతారని, దయచేసి ఆలోచించాలని వేడుకుంది. కాగా ‘సౌదీ అరేబియా తన విస్తృతమైన దుర్వినియోగాల నుంచి పరిశీలనను మళ్లించేందుకు ప్రముఖులు, ప్రధాన అంతర్జాతీయ ఈవెంట్స్‌ను ఉపయోగించిన చరిత్రను కలిగి ఉంది’ అని ఇంటర్నేషన్ మీడియా ప్రచురించింది.






