వాషింగ్ మెషీన్ లో దాక్కున్న అమ్మాయి.. కాపాడిన రెస్క్యూ టీం

by  |
వాషింగ్ మెషీన్ లో దాక్కున్న అమ్మాయి.. కాపాడిన రెస్క్యూ టీం
X

దిశ వెబ్ డెస్క్: ‘చిన్నప్పుడు నేను నా స్నేహితులు కలిసి గండిపేట్ పిక్నిక్ వెళ్లాం.. అక్కడ మేమందరం కలిసి దొంగపోలీస్ ఆడుకోవాలనుకున్నాం. నా బెస్ట్ ఫ్రెండ్ సుధీర్ అవుటయ్యాడు. నేను పోలీస్.. వాడు దొంగ. దొంగ దాక్కోవాలి కదా. వాడికి ఎక్కడ దాక్కోవాలో అర్థం కాలేదు. దాంతో పక్కనే ఉన్న చెరువులో దాక్కున్నాడు’ అని మన్మథుడు సినిమాలో ఓ సీన్ లో నాగార్జునా చెబితే.. అయితే వాడు మీకు దొరకలేదా? అని బ్రహ్మనందం ప్రశ్నిస్తాడు. అందుకు నాకే కాదు ఎవరికీ దొరకలేడని నాగార్జున సమాధానం చెబుతాడు. అయినా ఇప్పుడు ఈ సినిమా డైలాగ్ ఏంటీ అనుకుంటున్నారా? అమెరికాలో హైడ్ అండ్ సీక్ (దాగుడు మూతలు) గేమ్ ఆడుతున్న ఓ యువతి కూడా ఇలాగే ఆలోచించింది. అంటే నీళ్లలో దాక్కోలేదు. కానీ వింతగా .. వాషింగ్ మెషిన్ లో దాక్కుంది. ఆ తర్వాత ఏమైందంటే..?

కరోనా కారణంగా ప్రపంచంలోని చాలా దేశాల్లో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అమెరికాలో కూడా లాక్డౌన్ అమల్లో ఉంది. దాంతో ప్రజలంతా ఇల్లకే పరిమితమయ్యారు. బోర్ కొట్టడంతో.. పద్దెనిమిదేళ్ల ఎమరీ డాన్సీ, తన సోదరితో దాగుడు మూతలు ఆడాలనుకుంది. అయితే దాక్కోవడానికి ఎక్కడా ప్లేస్ దొరకనట్లు .. వెళ్లి వాషింగ్ మెషిన్ లో కూర్చుంది. అక్కడికి వరకు కథ బాగానే ఉంది. చిన్నగా ఉన్న ఆ వాషింగ్ మెషిన్ లో ఆమె చిక్కుకుపోయింది. అయితే ఆమె ఎంత ప్రయత్నించినా అందుంలోంచి బయటకు రాలేకపోయింది. ఇంట్లో వాళ్లూ కూడా ట్రై చేసినా ఫలితం లేకపోయింది. వాళ్లు వెంటనే ఎమర్జెన్సీ నెంబర్ కు ఫోన్ చేశారు. నానా తంటాలు పడి ఫైర్ ఫైటర్స్ రెస్క్యూ టీం ఆమెను బయటకు తీసింది. అయితే రెస్క్యూ టీం ఎమరీని బయటకు తీస్తున్నదంతా వీడియో తీసింది ఎమరీ వాళ్ల ఆంటీ. ఆ వీడియోను కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

tags : lockdown, hide and seek, rescue team, firefighters , amari dancy

Next Story

Most Viewed