- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ మూడు దేశాలు కాలుష్యాన్ని నియంత్రించవు : ట్రంప్
<p>దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇండియాపై ఫైర్ అయ్యారు. వాతావరణ కలుష్యంపై మన దేశం తీసుకుంటున్న చర్యలపై గుర్రుగా ఉన్నారు. మనతో పాటే రష్యా, చైనాలు కూడా వాయు కాలుష్యాన్ని కంట్రోల్ చేయడం లేదని విమర్శించారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి తాము ఎంతో చేస్తున్నామని చెప్పారు. ఆ మూడు దేశాలు మాత్రం వాతావరణ కాలుష్యాన్ని పట్టించుకోబోవని ఎద్దేవచేశారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం తమ దేశాన్ని నెంబర్ వన్ స్థానంలోనే నిలబెడతానని […]</p>

దిశ, వెబ్ డెస్క్ :
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇండియాపై ఫైర్ అయ్యారు. వాతావరణ కలుష్యంపై మన దేశం తీసుకుంటున్న చర్యలపై గుర్రుగా ఉన్నారు. మనతో పాటే రష్యా, చైనాలు కూడా వాయు కాలుష్యాన్ని కంట్రోల్ చేయడం లేదని విమర్శించారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి తాము ఎంతో చేస్తున్నామని చెప్పారు. ఆ మూడు దేశాలు మాత్రం వాతావరణ కాలుష్యాన్ని పట్టించుకోబోవని ఎద్దేవచేశారు.
తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం తమ దేశాన్ని నెంబర్ వన్ స్థానంలోనే నిలబెడతానని ట్రంప్ చెప్పుకొచ్చారు. కొన్నేళ్లుగా ఇతర దేశాలను తొలి స్థానంలో నిలబెట్టామని..ఇప్పుడు అమెరిగా ఫస్ట్ ప్లేస్‌లో ఉందన్నారు. డెమోక్రాట్లు అమెరికాను నాశనం చేయాలనుకుంటున్నారని.. అమెరికన్ల జీవన విధానంపై డెమోక్రాట్లకు గౌరవం లేదని విమర్శించారు. ప్రపంచ చరిత్రలో అమెరికన్ల జీవన విధానం కంటే మెరుగైనది ఏదీ లేదన్నారు.
గత ప్రభుత్వంలో అమెరికా ఎనర్జీ రంగాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరిగాయని… యూఎస్ అధ్యక్షుడిగా తాను బాధ్యతలను తీసుకున్న తర్వాత ఆ ప్రయత్నాలను అంతం చేశానని ట్రంప్ గుర్తుచేశారు. ప్యారిస్ క్లైమేట్ ఒప్పందం అమెరికాకు ఆర్థిక భారమని.. ఒప్పందం నుంచి బయటకు రావడం వల్ల బిలియన్ల కొద్దీ డాలర్లు ఆదా అయ్యాయని వివరించారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత అమెరికా ఎనర్జీ ఎగుమతిదారుగా ఎదిగిందని స్పష్టంచేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు, సహజవాయువు ఉత్తత్తిదారుగా అమెరికా అవతరించిందన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో విపక్ష డిమోక్రాట్లపై ట్రంప్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మరోసారి అధికార పగ్గాలను చేపట్టేందుకు తన సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు తెలుస్తోంది.






