- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ రికార్డుతో కల నిజమైంది :ఊర్వశి రౌతేలా
<p>దిశ, వెబ్‌డెస్క్: హాటెస్ట్ మోడల్ కమ్ యాక్ట్రెస్ ఊర్వశి రౌతేలా.. తన మిస్ యూనివర్స్ ఇండియా విన్నింగ్ మూమెంట్స్‌ను గుర్తు చేసుకుంది. 2012, 2015లో రెండుసార్లు ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ గెలుచుకున్న ఏకైక అమ్మాయిగా చరిత్రలో నిలవడం ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు తెలిపింది. ఈ విన్నింగ్ మూమెంట్‌కు ఐదేళ్లు కాగా.. ఈ ప్రపంచ రికార్డుతో తన జీవితం పూర్తిగా మారిపోయిందని, తన కల నిజమైందని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అలాంటి అరుదైన రికార్డును […]</p>

దిశ, వెబ్‌డెస్క్: హాటెస్ట్ మోడల్ కమ్ యాక్ట్రెస్ ఊర్వశి రౌతేలా.. తన మిస్ యూనివర్స్ ఇండియా విన్నింగ్ మూమెంట్స్‌ను గుర్తు చేసుకుంది. 2012, 2015లో రెండుసార్లు ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ గెలుచుకున్న ఏకైక అమ్మాయిగా చరిత్రలో నిలవడం ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు తెలిపింది. ఈ విన్నింగ్ మూమెంట్‌కు ఐదేళ్లు కాగా.. ఈ ప్రపంచ రికార్డుతో తన జీవితం పూర్తిగా మారిపోయిందని, తన కల నిజమైందని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అలాంటి అరుదైన రికార్డును పొందిన తాను.. మరింత మంది జీవితాల్లో వెలుగు నింపేందుకు సన్నద్ధం అవుతున్నట్లు తెలిపింది. కానీ ఇందుకోసం ధైర్యం అవసరమని భావిస్తున్నట్లుగా వెల్లడించింది. నటనకు అంకితం అయిపోయానన్న ఊర్వశి.. మహిళలను ప్రోత్సహించేందుకు, వారికి సాధికారత కల్పించి విద్యావంతులుగా మార్చేందుకు తన వంతు సాయం చేస్తానని ప్రకటించింది.
https://www.instagram.com/p/CJDlOV5hFZa/?utm_source=ig_web_copy_link
చివరగా బాలీవుడ్ మూవీ ‘వర్జిన్ భానుప్రియ’లో కనిపించిన ఊర్వశి రౌతేలా.. ‘ఓ చాంద్ కహా సే లావోగి’ వీడియోతో యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. ఇక తెలుగు, హిందీలో బైలింగ్వల్‌గా వస్తున్న ‘బ్లాక్ రోజ్’ షూటింగ్ పూర్తి కాగా.. నెక్స్ట్ మ్యూజిక్ వీడియో ‘తేరి లోడ్ వే’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.






