నవంబర్‌లో ఓటీటీ మూవీస్

by  |
నవంబర్‌లో ఓటీటీ మూవీస్
X

దిశ, వెబ్‌డెస్క్ :
పండుగలు వస్తున్నాయంటే.. థియేటర్‌లో కొత్త సినిమాల సందడి కనిపించేది. కానీ కరోనా కారణంగా ప్రస్తుతం అలాంటి సంబరాలేవీ కనిపించడం లేదు. ఇక దీపావళి పండుగను పురస్కరించుకుని బాలీవుడ్ నుంచి కనీసం రెండు మూడు సినిమాలైనా విడుదలయ్యేవి. ఈ సారి కూడా రిలీజ్ అవుతున్నాయి కానీ, అవి ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించనున్నాయి. ఈ నెలలో కొన్ని బిగ్గెస్ట్ టైటిల్స్ ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. లాక్‌డౌన్‌లో ఇప్పటివరకు వచ్చిన సినిమాల పరంగా చూసుకుంటే, అక్షయ్ నుంచి వస్తున్న ‘లక్ష్మి’ బిగ్గెస్ట్ రిలీజ్‌గా చెప్పుకోవచ్చు. అంతేకాదు ఆదిత్య రాయ్ కపూర్, రాజ్ కుమార్ రావు కలయికలో మల్టీస్టారర్‌గా రాబోతున్న ‘లూడో’ మూవీ కూడా ఇదే నెలలో విడుదల కానుంది. వీటితో పాటు ఆసక్తికర కథ, కథనాలతో కూడిన పలు వెబ్ సిరీస్‌లు సైతం ఈ లిస్టులో ఉండటం విశేషం.

నెట్‌ఫ్లిక్స్

నవంబర్ 12 – లూడో
నవంబర్ 27 – వర్జిన్ రివర్ సీజన్ -2 (వెబ్ సిరీస్)

అమెజాన్ ప్రైమ్

నవంబర్ 13 – చలాంగ్
నవంబర్ 20 – మిడిల్ క్లాస్ మెలోడీస్

హాట్‌స్టార్

నవంబర్ 9 – లక్ష్మి
నవంబర్ ఎండ్ – భుజ్

జీ5

నవంబర్ 20 – రాత్ బాకి హై
నవంబర్ 24 – డార్క్ 7 వైట్ (వెబ్ సిరీస్)

ఎంఎక్స్ ప్లేయర్

నవంబర్ 11 – ఆశ్రమ్ చాప్టర్ 2 (వెబ్ సిరీస్ )

నవంబర్‌లోనే కాదు, వచ్చే డిసెంబర్‌లోనూ మచ్ అవెయిటెడ్ మూవీస్ రాబోతున్నాయి. అందులో భాగంగానే.. గ్లోబల్ స్టార్ ప్రియాంక్ చోప్రా, రాజ్ కుమార్ రావు, ఆదర్శ్ గౌరవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వైట్ టైగర్’ ట్రైలర్ ఇటీవలే నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది. వరుణ్ ధావన్ కూలీ నెం1 రీమేక్ కూడా అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలయ్యే అవకాశం ఉంది.

Next Story

Most Viewed