బ్రాండ్ ఫ్యాక్టరీ ‘బడ్జెట్ షాపింగ్ బొనాంజా’

4

దిశ, వెబ్‌డెస్క్: పండుగ సీజన్ సందర్భంగా తక్కువ ధరలకే లేటెస్ట్ ఫ్యాషన్ దుస్తులను అందించేందుకు ప్రముఖ షాపింగ్ స్టోర్ బ్రాండ్ ఫ్యాక్టరీ తక్కువ చెల్లించండి-ఎక్కువ పొందండి అంటూ ‘అతిపెద్ద బడ్జెట్ షాపింగ్ బొనాంజా’ను బుధవారం ప్రారంభించింది. బేగంపేటలోని బ్రాండ్ ఫ్యాక్టరీ స్టోర్‌లో ఈ కార్యక్రమాన్ని టాలీవుడ్ నటి, బిగ్‌బాస్ సీజన్ 3లో పాల్గొన్న హిమజ ప్రారంభించారు.

పండుగ సీజన్ సందర్భంగా అత్యద్భుతమైన, ఆకర్షణీయమైన షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు ఈ సరికొత్త బడ్జెట్ షాపింగ్ బొనాంజా అందిస్తుందని, ఈ ఆఫర్ తెలంగాణ, ఏపీలోని 13 ఔట్‌లెట్ల ద్వారా అందుబాటులో ఉండనున్నట్టు సంస్థ వెల్లడించింది. వీటిలో 10 స్టోర్లు హైదరాబాద్‌లోనూ, వైజాగ్, విజయవాడ, తిరుపతిలలో ఒక్కోటి ఉన్నాయని పేర్కొంది.

ఈ సందర్భంగా మాట్లాడిన హిమజ..బ్రాండ్ ఫ్యాకటరీలో సరికొత్త ఆఫర్లతో, సరికొత్త కలెక్షన్లు స్టైలిష్‌గా ఉన్నాయని, ఎక్కువ వెరైటీలు, కలర్లలో దుస్తులు లభించడం సంతోషంగా ఉందన్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ దొరికే ఫ్యాషన్ దుస్తులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని, దసరా, దీపావళికి మంచి షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ బ్రాండ్ ఫ్యాక్టరీ ఇస్తుందని చెప్పారు.

బ్రాండ్ ఫ్యాక్టరీ సీఈవో సురేష్ సద్వాని మాట్లాడుతూ… ‘తక్కువ చెల్లించండి-ఎక్కువ పొందండి’ తో పండుగ సేల్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ పండుగకు హైదరాబాద్‌లోని తమ కస్టమర్లు ఎక్కువ ప్రయోజనాలను పొందుతారని ఆశిస్తున్నాము. అంతేకాకుండా, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని సురక్షితమైన చర్యలు తీసుకుంటున్నామని, కస్టమర్లు ఎలాంటి ఆందోళన లేకుండా షాపింగ్ చేసుకోవచ్చని చెప్పారు.