- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంబెలెన్స్, ఇన్నోవాకు నిప్పంటించిన ఆకతాయిలు
by Batti.Sumithra |
<p>దిశ, హైదరాబాద్: మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కేనగర్, విష్ణుపురి కాలనీల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. ఇంటి వద్ద పార్క్ చేసిన వాహనాలకు దుండగులు నిప్పంటించడంతో అవి తగలబడి యజమానులకు నష్టాన్ని మిగిల్చాయి. శుక్రవారం రాత్రి ఆర్కేనగర్‌లో రాజు అనే వ్యక్తి తాను ఉండే ఇంటి దగ్గర అంబులెన్స్ వాహనాన్ని పార్క్ చేశాడు. శనివారం మార్నింగ్ చూసేసరికి అంబులెన్స్ తగలబడి ఉండటంతో షాక్‌కు గురయ్యాడు. అంతేగాక విష్ణపురి కాలనీలో తన బావమరిదికి చెందిన ఇన్నోవా వాహనానికి కూడా దొంగలు […]</p>

X
దిశ, హైదరాబాద్: మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కేనగర్, విష్ణుపురి కాలనీల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. ఇంటి వద్ద పార్క్ చేసిన వాహనాలకు దుండగులు నిప్పంటించడంతో అవి తగలబడి యజమానులకు నష్టాన్ని మిగిల్చాయి. శుక్రవారం రాత్రి ఆర్కేనగర్‌లో రాజు అనే వ్యక్తి తాను ఉండే ఇంటి దగ్గర అంబులెన్స్ వాహనాన్ని పార్క్ చేశాడు. శనివారం మార్నింగ్ చూసేసరికి అంబులెన్స్ తగలబడి ఉండటంతో షాక్‌కు గురయ్యాడు. అంతేగాక విష్ణపురి కాలనీలో తన బావమరిదికి చెందిన ఇన్నోవా వాహనానికి కూడా దొంగలు నిప్పంటించడంతో పాక్షికంగా దెబ్బతింది. సీసీ టీవీల్లో నమోదైన దృశ్యాల ప్రకారం ఘటన శనివారం తెల్లవారుజామున 3గంటల సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. వాహనాలు తగలబడటంపై బాధితులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






