- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైడ్ ఇవ్వలేదని.. గ్యాస్ సిబ్బందిపై దాడి..!
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలో ప్రతీ చిన్న విషయాలకు కొందరు విచక్షణను కోల్పోతున్నారు. ఇదేంటనీ అడిగిన వారిని చితకబాదుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే నగరంలోని కూకట్‌పల్లి అల్విన్ కాలనీలో సోమవారం వెలుగులోకి వచ్చింది. వివారాల్లోకివెళితే.. తమ ద్విచక్ర వాహనానికి సైడ్ ఇవ్వలేదనే కారణంతో గ్యాస్ ఆటో సిబ్బందిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అల్విన్ కాలనీ మెయిన్ రోడ్ బస్టాప్ వద్ద ఇవాళ ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ట్రినిటి ఇండేన్ గ్యాస్ ఏజన్సీ ఆటో ట్రాలీ […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలో ప్రతీ చిన్న విషయాలకు కొందరు విచక్షణను కోల్పోతున్నారు. ఇదేంటనీ అడిగిన వారిని చితకబాదుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే నగరంలోని కూకట్‌పల్లి అల్విన్ కాలనీలో సోమవారం వెలుగులోకి వచ్చింది. వివారాల్లోకివెళితే.. తమ ద్విచక్ర వాహనానికి సైడ్ ఇవ్వలేదనే కారణంతో గ్యాస్ ఆటో సిబ్బందిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.
అల్విన్ కాలనీ మెయిన్ రోడ్ బస్టాప్ వద్ద ఇవాళ ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ట్రినిటి ఇండేన్ గ్యాస్ ఏజన్సీ ఆటో ట్రాలీ రోడ్డుపైనే నిలిచి పోయింది. అదే సమయంలో బైక్ పై ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు వెనుక నుంచి హారన్ మోగించారు. ముందు ట్రాఫిక్ ఉందని గ్యాస్ ఆటో సిబ్బంది సమాధానం ఇవ్వగా.. సహనం కోల్పోయిన వారు చేతిలో ఉన్న ప్రెజర్ కుక్కర్‌తో గ్యాస్ ఆటో సిబ్బందిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆటో డ్రైవర్, డెలివరీ బాయ్ తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది.






